Odisha train accident:48 గంటల తర్వాత శిథిలాల్లో వెలుగుచూసిన అసోం యువకుడు

Odisha train accident:48 గంటల తర్వాత శిథిలాల్లో వెలుగుచూసిన అసోం యువకుడు

Assam man found alive

Odisha train accident: ఒడిశా రైలు ప్రమాదం జరిగిన 48 గంటల తర్వాత అసోంకు చెందిన ప్రయాణికుడు దులాల్ మజుందార్ శిథిలాల కింద సజీవంగా కనిపించారు. పట్టాలు తప్పిన కోరమండల్ ఎక్స్ ప్రెస్ కోచ్ పక్కన పొదల్లో నుంచి సహాయం కోసం పిలుపు వినిపించగా రెస్క్యూ సిబ్బంది అతన్ని కాపాడారు.(48 hours later Assam man found alive) తీవ్ర గాయంతోపాటు డీహైడ్రేషన్ కారణంగా దులాల్ మజుందార్ బలహీనంగా ఉండటంతో అతన్ని వెంటనే సోరోలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అందించిన తర్వాత బాలాసోర్ జిల్లా ప్రధాన ఆసుపత్రికి తరలించామని సోరో పోలీసు స్టేషన్ అధికారులు చెప్పారు.

Droupadi Murmu: రాష్ట్రపతి ద్రౌపది ముర్మూకు సురినామ్ దేశ అత్యున్నత పౌర పురస్కారం

రైలు ప్రమాదం జరిగిన 48 గంటల తర్వాత ఒక వ్యక్తి జీవించడం విశేషమని రెస్క్యూ సిబ్బంది చెప్పారు.బాలాసోర్ జిల్లా ప్రధాన ఆసుపత్రిలో బలహీనంగా ఉన్నప్పటికీ, ఆ వ్యక్తిని అసోంకు చెందిన 35 ఏళ్ల దులాల్ మజుందార్‌గా గుర్తించారు. దులాల్ అసోం రాష్ట్రానికి చెందిన మరో ఐదుగురితో కలిసి కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్నాడు. అతని మిత్రులు సజీవంగా ఉన్నారా లేదా గాయపడిన వారిలో ఉన్నారా అనేది అస్పష్టంగా ఉంది.

Another rail accident : ఒడిశాలో మరో రైలు ప్రమాదం.. పట్టాలు తప్పిన గూడ్స్ రైలు

రైలు ప్రమాదం జరిగినప్పుడు అతను కోరమండల్ ఎక్స్‌ప్రెస్ జనరల్ కంపార్ట్‌మెంట్‌లో ఉన్నాడు. ‘‘ప్రమాద ధాటికి అతను ఎగిరి పొదలో పడ్డాడు. అతను రెండు రోజులపాటు ప్రాణాలతో బయటపడడం ఒక అద్భుతం’’ అని బాలాసోర్ జిల్లా ప్రధాన ఆసుపత్రికి చెందిన డాక్టర్ సుభాజిత్ గిరి అన్నారు.మృతదేహాల కోసం స్థానిక పోలీసులు, రైల్వే అధికారులు మళ్లీ ఆ ప్రాంతాన్ని పరిశీలించారు.