Droupadi Murmu: రాష్ట్రపతి ద్రౌపది ముర్మూకు సురినామ్ దేశ అత్యున్నత పౌర పురస్కారం

Droupadi Murmu: రాష్ట్రపతి ద్రౌపది ముర్మూకు సురినామ్ దేశ అత్యున్నత పౌర పురస్కారం

President Droupadi Murmu

Suriname civilian award to Droupadi Murmu: విదేశీ పర్యటనలో ఉన్న భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్మూకు సురినామ్ అత్యున్నత పౌర పురస్కారాన్ని ప్రదానం చేశారు. మూడు రోజుల పర్యటన కోసం సురినామ్ దేశానికి చేరుకున్న ముర్మూకు ఆ దేశ అధ్యక్షుడు సంతోఖి ఘన స్వాగతం పలికారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్మూకు(President Droupadi Murmu) సురినామ్(Suriname confers) దేశ అత్యున్నత పౌర పురస్కారమైన గ్రాండ్ ఆర్డర్ ఆఫ్ ది చైన్ ఆఫ్ ది ఎల్లో స్టార్ అవార్డు సురినామ్ అధ్యక్షుడు చంద్రికాపర్సాద్ సంతోఖి ఈ అవార్డును అందజేశారు. మూడు రోజుల రాష్ట్ర పర్యటన సందర్భంగా తనకు సురినామ్ దేశ అత్యున్నత గుర్తింపు పొందడం తనకు గౌరవంగా ఉందని రాష్ట్రపతి ద్రౌపది అన్నారు.

Balasore: బాలాసోర్‌లో రైల్వేట్రాక్ పునరుద్ధరణ…వందేభారత్‌తోపాటు ప్యాసింజర్ రైళ్ల రాకపోకలు షురూ

‘‘గాఢంగా పాతుకుపోయిన భారత్-సురినామ్ సంబంధాలకు ప్రతిఫలించే గౌరవం, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సురినామ్ దేశ అత్యున్నత పౌర పురస్కారాన్ని ప్రదానం చేశారు’’ అని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి ట్వీట్ చేశారు.ఈ గుర్తింపు తనకు మాత్రమే కాకుండా భారతదేశంలోని 1.4 బిలియన్ల ప్రజలకు కూడా గొప్ప ప్రాముఖ్యత ఉందని ప్రెసిడెంట్ ముర్ము వ్యాఖ్యానించారు.‘‘మా రెండు దేశాల మధ్య సోదర సంబంధాలను సుసంపన్నం చేయడంలో అద్భుతమైన పాత్ర పోషించిన భారతీయ-సురినామీస్ సమాజంలోని భావితరాలకు కూడా నేను ఈ గౌరవాన్ని అంకితం చేస్తున్నాను’’ అని ఆమె ట్వీట్ చేశారు.గత ఏడాది జులైలో పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత తన మొదటి విదేశ పర్యటనలో భాగంగా సురినామ్‌కు చేరుకున్న ముర్మూకు ఇక్కడి రాష్ట్రపతి భవన్‌లో అధ్యక్షుడు సంతోఖి నుంచి ఘనస్వాగతం లభించింది.

Monsoon : నైరుతి రుతుపవనాల రాకపై ఐఎండీ కీలక ప్రకటన

రాష్ట్రపతి ముర్మూ ప్రెసిడెంట్ సంతోఖితో ప్రతినిధి స్థాయి చర్చలు జరిపారు.ప్రెసిడెంట్ ముర్ము, చంద్రికాపర్సాద్ సంతోఖి ఆరోగ్యం, వ్యవసాయంతో సహా వివిధ రంగాల్లో నాలుగు అవగాహన ఒప్పందాలను కుదుర్చుకున్నారు. రక్షణ, ఐటీ, సామర్థ్య నిర్మాణంతో సహా పలు రంగాలలో ద్వైపాక్షిక సహకారాన్ని మరింతగా పెంచుకునే మార్గాలపై ఇద్దరు నేతలు చర్చించారు.సురినామ్‌కు భారతీయులు వచ్చి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా స్టాంపుల ప్రత్యేక కవర్లను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఈ సందర్భంగా అందించారు. సురినామ్‌కు భారతదేశం అత్యవసర ఔషధాలను విరాళంగా అందించినందుకు గుర్తుగా రాష్ట్రపతికి సింబాలిక్‌గా ఔషధాల పెట్టెను అందించారని రాష్ట్రపతి కార్యాలయం ఒక ట్వీట్‌లో తెలిపింది.రాష్ట్రపతి ముర్మూ బాబా, మాయి స్మారక చిహ్నాల వద్ద నివాళులర్పించారు.