Warangal: వరంగల్‌లో ప్రేమోన్మాది ఘాతుకం.. యువతిపై దాడి..
వరంగల్ జిల్లాలో ప్రేమోన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు. విద్యార్థి పట్ల అనుమాషంగా ప్రవర్తించాడు. గొంతుకోసి తీవ్రంగా గాయపర్చడంతో చికిత్స నిమిత్తం స్థానిక ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు.
- Harishth Thanniru
- Published On : April 22, 2022 / 12:33 PM IST
Crime News
Warangal: వరంగల్ జిల్లాలో ప్రేమోన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు. విద్యార్థి పట్ల అనుమాషంగా ప్రవర్తించాడు. గొంతుకోసి తీవ్రంగా గాయపర్చడంతో చికిత్స నిమిత్తం స్థానిక ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. వివరాల్లోకి వెళితే. అనూష అనే విద్యార్థిని కాకతీయ యూనివర్శిటీలో ఎంసీఏ ఫైనల్ ఇయర్ చదువుతుంది. కొద్దికాలంగా అనూషను ప్రేమ పేరుతో అజహర్ అనే యువకుడు వేధిస్తున్నాడు. విద్యార్థిని అజహర్ ప్రేమను నిరాకరిస్తూ వస్తుంది. దీంతో ప్రేమోన్మాదంతో రెచ్చిపోయిన అజహర్ అనూషపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. గొంతుపై కోసి అక్కడి నుంచి పరారయ్యాడు. తీవ్రగాయం కావడంతో స్థానికులు వెంటనే అనూషను చికిత్స నిమిత్తం ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు.
AP Crime : విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో వికలాంగురాలిపై సామూహిక అత్యాచార ఘటనలో సీఐ, ఎస్సై సస్పెన్షన్
విద్యార్థి అనూష స్వగ్రామం నర్సంపేట మండలం లక్నేపల్లి గ్రామం. అశోక్ నగర్‌లో ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. హైదరాబాద్‌లో ఉంటున్న అనూష శుక్రవారం ఉదయమే ఇంటికి వచ్చింది. అదే కాలనీలో నివాసమంటున్న అజహర్ ప్రేమ పేరుతో ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
