×
Ad

Delhi : ఢిల్లీ బద్లీలో క్షిపణి లాంటి వస్తువు ప్రత్యక్షం…పోలీసుల కార్డన్‌సెర్చ్

దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో క్షిపణి లాంటి వస్తువును ఢిల్లీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సమయపూర్ బద్లీ పోలీసుస్టేషన్ పరిధిలోని రోహిణి ప్రాంత సెక్టార్ -28 వద్ద ఉన్న మునాక్ కెనాల్ నుంచి క్షిపణి లాంటి వస్తువును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు....

  • Published On : August 7, 2023 / 06:30 AM IST

Missile-like object found

Delhi : దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో క్షిపణి లాంటి వస్తువును ఢిల్లీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సమయపూర్ బద్లీ పోలీసుస్టేషన్ పరిధిలోని రోహిణి ప్రాంత సెక్టార్ -28 వద్ద ఉన్న మునాక్ కెనాల్ నుంచి క్షిపణి లాంటి వస్తువును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. (Missile-like object found in Delhi) క్షిపణి లాంటి వస్తువు గురించి తమకు సమాచారం అందిందని, దాన్ని స్వాధీనం చేసుకున్నామని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఔటర్ నార్త్) రవికుమార్ సింగ్ చెప్పారు.

Cricketer Sarfaraz Khan : కశ్మీరు కన్యతో క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ వివాహం

క్షిపణి సమాచారం అందడంతో ముందుజాగ్రత్త చర్యగా ఆ ప్రాంతాన్ని పోలీసులు చుట్టుముట్టారు. (area cordoned off) ప్రాథమికంగా ఇది పాత మోర్టార్ షెల్ లాగా ఉందని గుర్తించారు. ఈ షెల్‌ను పారవేసేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు డీసీపీ తెలిపారు. స్వాధీనం చేసుకున్న పేలుడు పదార్థాన్ని పారవేసేందుకు కేంద్రం ఆధీనంలోని ఉగ్రవాద వ్యతిరేక ఏజెన్సీ నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ (NSG) కు సమాచారం అందించారు.

IND VS WI 2nd T20 : ఉత్కంఠ పోరులో వెస్టిండీస్‌ విజ‌యం.. వ‌రుస‌గా రెండు టీ20ల్లో గెలుపు

అంతకుముందు ఏప్రిల్ 21 వతేదీన ఢిల్లీలోని కపషేరా గ్రామంలోని డ్రైన్ నుంచి పాత మోర్టార్ షెల్‌ను కూడా ఢిల్లీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తర్వాత పాత మోర్టార్ షెల్‌ను పారవేసేందుకు ఢిల్లీ పోలీసులు నేషనల్ సెక్యూరిటీ గార్డ్ కి చెందిన బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్‌ని పిలిచారు.