IND VS WI 2nd T20 : ఉత్కంఠ పోరులో వెస్టిండీస్‌ విజ‌యం.. వ‌రుస‌గా రెండు టీ20ల్లో గెలుపు

వ‌రుస‌గా రెండో టీ20 మ్యాచులోనూ టీమ్ఇండియా ఓడిపోయింది. ఫ‌లితంగా 5 మ్యాచుల టీ20 సిరీస్‌లో 0-2తేడాతో వెన‌క‌బ‌డిపోయింది. గ‌యానా వేదిక‌గా జ‌రిగిన రెండో టీ20 మ్యాచులో విండీస్ 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

IND VS WI 2nd T20 : ఉత్కంఠ పోరులో వెస్టిండీస్‌ విజ‌యం.. వ‌రుస‌గా రెండు టీ20ల్లో గెలుపు

West Indies

వ‌రుస‌గా రెండో టీ20 మ్యాచులోనూ టీమ్ఇండియా ఓడిపోయింది. ఫ‌లితంగా 5 మ్యాచుల టీ20 సిరీస్‌లో 0-2తేడాతో వెన‌క‌బ‌డిపోయింది. గ‌యానా వేదిక‌గా జ‌రిగిన రెండో టీ20 మ్యాచులో విండీస్ 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 153 ప‌రుగుల‌ ల‌క్ష్యాన్ని8 వికెట్లు కోల్పోయి 18.5 ఓవ‌ర్ల‌లో ఛేదించింది. నికోల‌స్ పూర‌న్(67; 40 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స‌ర్లు) అర్ధ‌శ‌త‌కంతో జ‌ట్టు విజ‌యానికి బాట‌లు వేశాడు. అయితే.. రొమెన్ పావెల్‌(21), షిమ్రాన్ హెట్మెయర్(22)లు ఔట్ కావ‌డంతో పాటు జేస‌న్ హోల్డ‌ర్ విఫ‌లం (0) విఫ‌లం కావ‌డంతో 129 ప‌రుగుల‌కే 8 వికెట్లు కోల్పోయి ఓట‌మి అంచుల్లో నిలిచింది. అయితే.. అల్జారీ జోసెఫ్‌(10 నాటౌట్‌), అకిల్ హోసెన్ (16 నాటౌట్‌) లు రాణించి విండీస్‌కు విజ‌యాన్ని అందించారు.భార‌త బౌల‌ర్ల‌లో హార్దిక్ పాండ్య మూడు వికెట్లు తీయ‌గా, చాహ‌ల్ రెండు, ముకేశ్ కుమార్‌, అర్ష్‌దీప్ సింగ్ త‌లా ఓ వికెట్ ప‌డ‌గొట్టారు.

Rohit Sharma : రిటైర్‌మెంట్‌పై రోహిత్ శ‌ర్మ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు.. ఆటకు వీడ్కోలు ఎప్పుడంటే..?

అంత‌క‌ముందు మొద‌ట బ్యాటింగ్ చేసిన‌ టీమ్ఇండియా నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 7 వికెట్ల న‌ష్టానికి 152 ప‌రుగులు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న‌ భార‌త్‌కు శుభారంభం ద‌క్క‌లేదు. శుభ్‌మ‌న్ గిల్ (7), సూర్య‌కుమార్ యాద‌వ్‌(1) లు విఫ‌లం కావ‌డంతో 18 ప‌రుగుల‌కే టీమ్ఇండియా రెండు వికెట్లు కోల్పోయి క‌ష్టాల్లో ప‌డింది. ఈ ద‌శ‌లో ఓపెన‌ర్ ఇషాన్ కిష‌న్ (27) తో జ‌త క‌లిసిన తిల‌క్ వ‌ర్మ(51; 41బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌) ఇన్నింగ్స్ నిల‌బ‌ట్టే బాధ్య‌త‌ను తీసుకున్నాడు. వీరిద్ద‌రు మూడో వికెట్‌కు 42 ప‌రుగులు జోడించారు. సంజు శాంస‌న్‌(7) మ‌రోసారి నిరాశ ప‌రిచిన‌ప్ప‌టికీ కెప్టెన్ హార్దిక్ పాండ్య(24) అండ‌తో తిల‌క్ శ‌ర్మ త‌న‌దైన శైలిలో ప‌రుగులు రాబ‌ట్టాడు.

ICC Cricket World Cup 2023: క్రికెట్ జట్టును భారత్‌కు పంపడంపై పాక్ తుది నిర్ణయం.. ఇండియాపై సంచలన కామెంట్స్

ఈ క్ర‌మంలో 39 బంతుల్లో త‌న కెరీర్‌లో అంత‌ర్జాతీయ టీ20ల్లో తొలి అర్ధ‌శ‌త‌కాన్ని సాధించాడు. ఆ వెంట‌నే అకేల్‌హోసెన్ బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు. అప్ప‌టికి భార‌త స్కోరు 114/5. అక్ష‌ర్ ప‌టేల్‌(14)తో క‌లిసి పాండ్య ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకువెళ్లాడు. వీరిద్ద‌రు పెవిలియ‌న్‌కు చేరుకున్నా ఆఖ‌ర్లో ర‌వి బిష్ణోయ్‌(8 నాటౌట్), అర్ష్‌దీప్ సింగ్‌(6 నాటౌట్)లు రాణించ‌డంతో భార‌త్ 150 ప‌రుగులు దాటింది. వెస్టిండీస్ బౌల‌ర్ల‌లో అకిల్ హోసెన్‌, అల్జారీ జోసెఫ్‌, షెప‌ర్డ్ తలా రెండు వికెట్లు తీశారు.