ICC Cricket World Cup 2023: క్రికెట్ జట్టును భారత్‌కు పంపడంపై పాక్ తుది నిర్ణయం.. ఇండియాపై సంచలన కామెంట్స్

తమ క్రికెట్ జట్టు సెక్యూరిటీ పట్ల పాకిస్థాన్ ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు తెలిపింది.

ICC Cricket World Cup 2023: క్రికెట్ జట్టును భారత్‌కు పంపడంపై పాక్ తుది నిర్ణయం.. ఇండియాపై సంచలన కామెంట్స్

ICC Cricket World Cup 2023 - Pakistan

ICC Cricket World Cup 2023 – Pakistan: ఐసీసీ క్రికెట్ వన్డే ప్రపంచ కప్ ఆడేందుకు తమ జట్టును భారత్‌(India)కు పంపడానికి పాకిస్థాన్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పాకిస్థాన్ విదేశాంగ శాఖ (Foreign Ministry of Pakistan) ఓ ప్రకటన చేసింది.

క్రీడలను రాజకీయ దృష్టితో చూడని విధానాన్నే పాకిస్థాన్ మొదటి నుంచీ అనుసరిస్తూ వస్తుందని చెప్పుకొచ్చింది. అందుకే, తమ క్రికెట్ జట్టును ఐసీసీ క్రికెట్ వన్డే ప్రపంచ కప్ -2023లో ఆడేందుకు పంపుతున్నామని పేర్కొంది. భారత్‌తో ధ్వైపాక్షిక సంబంధాల పరిస్థితి ఎలాగున్నా అంతర్జాతీయంగా క్రీడల విషయంలో బాధ్యతలను విస్మరించకూడదని పాకిస్థాన్ భావిస్తోందని చెప్పింది.

ఆసియా కప్‌లో ఆడేందుకు టీమిండియాను పాకిస్థాన్ కు పంపేందుకు భారత్ ఒప్పుకోలేదని, రాజీ పడలేదని గుర్తుచేసింది. తాము తీసుకున్న నిర్ణయం మాత్రం తమ బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తోన్న తీరును స్పష్టం చేసేలా ఉందని చెప్పుకొచ్చింది. అయితే, తమ క్రికెట్ జట్టు సెక్యూరిటీ పట్ల తాము ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు తెలిపింది.

ఈ విషయాన్ని అంతర్జాతీయ క్రికెట్ మండలి, భారత అధికారులకు తెలుపుతున్నామని చెప్పింది. భారత పర్యటనలో పాక్ క్రికెట్ జట్టుకు పూర్తి స్థాయి రక్షణ, భద్రత ఉంటుందని ఆశిస్తున్నట్లు పేర్కొంది. నిజానికి, పాకిస్థాన్ ముందు ఇతర ఏ మార్గమూ లేకే తమ క్రికెట్ జట్టును భారత్ కు పంపుతోంది.

IND VS WI 2nd T20 : స్వ‌ల్ప వ్య‌వ‌ధిలో రెండు వికెట్లు కోల్పోయిన భార‌త్‌.. Updates in telugu