IND VS WI 2nd T20 : ఉత్కంఠ పోరులో వెస్టిండీస్ విజయం
రెండో టీ20 మ్యాచ్‌లో హార్దిక్ పాండ్య టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. తొలి టీ20 మ్యాచ్‌లో బరిలోకి దిగిన జట్టులో ఓ మార్పు చోటు చేసుకుంది. కుల్దీప్ స్థానంలో బిష్ణోయ్ వచ్చాడు.

IND VS WI
వెస్టిండీస్ విజయం
153 లక్ష్యాన్ని వెస్టిండీస్ 18.5 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి ఛేదించింది.
పూరన్ ఔట్..
ముకేశ్ కుమార్ బౌలింగ్‌లో(13.6వ ఓవర్‌లో) సంజు శాంసన్ క్యాచ్ పట్టుకోవడంతో నికోలస్ పూరన్(67; 40 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లు) ఔట్ అయ్యాడు. దీంతో వెస్టిండీస్ 126 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయింది. 14 ఓవర్లకు వెస్టిండీస్ స్కోరు 126 5. షిమ్రాన్ హెట్మెయర్(21), షెపర్డ్ (0) క్రీజులో ఉన్నారు.
పూరన్ అర్ధశతకం.. పావెల్ ఔట్
హార్దిక్ పాండ్య బౌలింగ్‌లో(9.1వ ఓవర్‌లో) సింగిల్ తీసి నికోలస్ పూరన్ 29 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో హాప్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే.. ఇదే ఓవర్‌లోని ఐదో బంతికి పావెల్(21; 19 బంతుల్లో 1ఫోర్, 1సిక్స్) ముకేశ్ కుమార్ క్యాచ్ పట్టడంతో ఔట్ అయ్యాడు. దీంతో వెస్టిండీస్ 89 పరుగులకు 4 వికెట్లు కోల్పోయింది. 10 ఓవర్లకు వెస్టిండీస్ స్కోరు 91/4. నికోలస్ పూరన్(50), షిమ్రాన్ హెట్మెయర్(2) క్రీజులో ఉన్నారు.
మేయర్స్ ఔట్..
వెస్టిండీస్ మరో వికెట్ కోల్పోయింది. అర్షదీప్ సింగ్ బౌలింగ్‌లో(3.4వ ఓవర్) మేయర్స్ (15; 7 బంతుల్లో 2ఫోర్లు, 1సిక్స్) ఎల్బీడబ్ల్యూగా ఔట్ అయ్యాడు. దీంతో విండీస్ 32 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది.
మొదటి ఓవర్‌లోనే విండీస్‌కు రెండు షాకులు
లక్ష్యఛేదనకు దిగిన వెస్టిండీస్‌కు హార్దిక్ పాండ్య షాకిచ్చాడు. మొదటి ఓవర్‌లోనే రెండు వికెట్లు తీశాడు. మొదటి బంతికి బ్రెండన్ కింగ్(0) సూర్యకుమార్ యాదవ్ చేతికి చిక్కగా, నాలుగో బంతికి ఛార్లెస్(2) తిలక్ వర్మకు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. 1 ఓవర్‌కు వెస్టిండీస్ స్కోరు 2/2.
విండీస్ లక్షం 153
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. దీంతో వెస్టిండీస్ ముందు 153 పరుగుల లక్ష్యం నిలిచింది. భారత బ్యాటర్లలో తిలక్ వర్మ (51) అర్ధశతకంతో ఆకట్టుకోగా ఇషాన్ కిషన్(27), హార్ధిక్ పాండ్య(24)లు రాణించారు. శుభ్‌మన్ గిల్(7), సూర్యకుమార్ యాదవ్(7) లు విఫలం అయ్యారు. వెస్టిండీస్ బౌలర్లలో అకిల్ హోసెన్, అల్జారీ జోసెఫ్, షెపర్డ్ తలా రెండు వికెట్లు తీశారు.
తిలక్ వర్మ ఔట్
అర్ధశతకం చేసిన వెంటనే తిలక్ వర్మ(51; 41బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్) ఔట్ అయ్యాడు. అకేల్ హోసేన్ బౌలింగ్‌లో (15.5వ ఓవర్) మెకాయ్ క్యాచ్ పట్టడంతో తిలక్ ఔట్ అయ్యాడు. దీంతో భారత్ 114 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయింది. 16 ఓవర్లకు భారత్ స్కోరు 115/5. అక్షర్ పటేల్ (1), హార్దిక్ పాండ్య (15) క్రీజులో ఉన్నారు.
తిలక్ వర్మ అర్ధశతకం
అందివచ్చిన అవకాశాలను తిలక్ వర్మ సద్వినియోగం చేసుకుంటున్నాడు. రెండో మ్యాచ్‌లోనే తన తొలి టీ20 హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. మెకాయ్(14.6వ ఓవర్)లో సింగిల్ తీసి 39 బంతుల్లో 50 పరుగులు పూర్తి చేశాడు. 15 ఓవర్లకు భారత స్కోరు 106 4. తిలక్ వర్మ(50), హార్దిక్ పాండ్య(8) క్రీజులో ఉన్నారు.
శాంసన్ ఔట్
సంజు శాంసన్ దూకుడుగా ఆడేందుకు యత్నించి ఔట్ అయ్యాడు. అకేల్ హోసేన్ బౌలింగ్(11.2వ ఓవర్)లో భారీ షాట్ కొట్టేందుకు క్రీజు వదిలి ముందుకు వచ్చాడు. వికెట్ కీపర్ నికోలస్ పూరన్ అతడిని స్టంపౌట్ చేశాడు. దీంతో 76 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది.
ఇషాన్ కిషన్ క్లీన్ బౌల్డ్
భారత్ మరో వికెట్ కోల్పోయింది. షెపర్డ్ బౌలింగ్‌లో(9.3వ ఓవర్) ఓపెనర్ ఇషాన్ కిషన్(27; 23 బంతుల్లో 2ఫోర్లు, 2సిక్సర్లు) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో భారత్ 60 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది. 10 ఓవర్లకు భారత స్కోరు 65/3. సంజు శాంసన్(5), తిలక్ వర్మ(20) క్రీజులో ఉన్నారు.
సూర్యకుమార్ రనౌట్
టీమ్ఇండియా మరో వికెట్ కోల్పోయింది. విధ్వంసకర వీరుడు సూర్యకుమార్ యాదవ్ రనౌట్ అయ్యాడు. మెకాయ్ వేసిన 3.3వ ఓవర్‌కు రనౌట్ అయ్యాడు. దీంతో భారత్ 18 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. 4 ఓవర్లకు భారత స్కోరు 19/2. ఇషాన్ కిషన్(8), తిలక్ వర్మ(1) క్రీజులో ఉన్నారు.
శుభ్‌మన్ గిల్ ఔట్
శుభ్‌మన్ గిల్ (7; 9 బంతుల్లో 1 సిక్స్) మరోసారి విఫలం అయ్యాడు. అల్జారీ జోసెఫ్ బౌలింగ్‌లో (2.5వ ఓవర్) షిమ్రాన్ హెట్మెయర్ క్యాచ్ అందుకోవడంతో ఔట్ అయ్యాడు. దీంతో భారత్ 16 పరుగుల వద్ద మొదటి వికెట్ కోల్పోయింది.
వెస్టిండీస్ తుది జట్టు : బ్రాండన్ కింగ్, కైల్ మేయర్స్, జాన్సన్ చార్లెస్, నికోలస్ పూరన్(వికెట్ కీపర్), రోవ్‌మన్ పావెల్(కెప్టెన్), షిమ్రాన్ హెట్మెయర్, రొమారియో షెపర్డ్, జాసన్ హోల్డర్, అకేల్ హోసేన్, అల్జారీ జోసెఫ్, ఒబెడ్ మెక్‌కాయ్
భారత తుది జట్టు : ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), సంజు శాంసన్, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్, ముఖేష్ కుమార్, రవి బిష్ణోయ్
రెండో టీ20 మ్యాచ్‌లో హార్దిక్ పాండ్య టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. నిన్న ప్రాక్టీస్ సెషన్‌లో కుల్దీప్ యాదవ్ కు చిన్నపాటి గాయమైందని హార్దిక్ చెప్పాడు. అయితే.. మరీ తీవ్రమైన గాయం కానప్పటికీ ముందస్తు జాగ్రత్తగా అతడికి ఈ మ్యాచ్ నుంచి విశ్రాంతి ఇచ్చినట్లు చెప్పాడు. అతడి స్థానంలో రవి బిష్ణోయ్ తుది జట్టులోకి వచ్చినట్లు తెలిపాడు.