×
Ad

Hyderabad : బేగంపేట పేకాట కేసులో కొత్త కోణాలు..అరవింద్ అగర్వాల్ వెనుక రాజకీయ నేత ?

బేగంపేట పేకాట కేసులో కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. పండుగలు, సెలవు రోజుల్లో అరవింద్ అగర్వాల్ క్యాసినో నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది.

  • Published On : November 6, 2021 / 12:57 PM IST

Begumpet Gabling

Begumpet Gambling Case : బేగంపేట పేకాట కేసులో కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. పండుగలు, సెలవు రోజుల్లో అరవింద్ అగర్వాల్ క్యాసినో నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. నగరంలోని వ్యాపారవేత్తలు రాజకీయ నాయకులతో అరవింద్ అగర్వాల్‌కు పరిచయాలు ఉన్నట్లు సమాచారం. క్యాసినో నిర్వహించే ముందు ప్రముఖులకు ఇన్విటేషన్స్ పంపుతాడు.

Read More : Karthik Kumar Reddy Died : మనాలిలో విరిగిపడ్డ మంచు చరియలు..ఏపీకి చెందిన జవాన్ మృతి

అరవింద్ అగర్వాల్ ఫోన్ సీజ్ చేసిన పోలీసులు… అతని ఫోన్లో రాజకీయ నాయకులు, ప్రజా ప్రతినిధులు, బడా వ్యాపారవేత్తల లిస్టును చూసి అవాక్కయ్యారు. అరవింద్ అగర్వాల్ వెనకాల నగరానికి చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు ఉన్నట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. ఆ రాజకీయ నాయకుడి అండదండలతో స్వేచ్ఛగా పేకాట నిర్వహిస్తున్నాడు అగర్వాల్‌.

Read More : Bus Driver Escape : బస్సు రిపేరు అంటూ డబ్బులతో ఉడాయించారు.. ప్రయాణికుల అవస్థలు!

స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఏకకాలంలో సోదాలు జరిపారు. అరవింద్ అగర్వాల్ అనే వ్యక్తి నిర్వహిస్తన్న పేకాట అడ్డాపై దాడులు జరిపారు. అక్కడ పేకాట ఆడుతున్న 30 మందికి పైగా పేకాటరాయుళ్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భారీ మొత్తంలో నగదును స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్, బేగంపేట పోలీసులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. అయితే..పేకాట అడ్డాపై దాడి చేసిన విషయాన్ని హైదరాబాద్ లో ఉన్న ఓ ప్రముఖ నాయకుడికి తెలిసింది. దీంతో ఆయన జోక్యం చేసుకోవడంతో..కొంతమంది పేకాటరాయుళ్లను తప్పించినట్లు సమాచారం.