Karthik Kumar Reddy Died : మనాలిలో విరిగిపడ్డ మంచు చరియలు..ఏపీకి చెందిన జవాన్ మృతి

హిమాచల్ ప్రదేశ్ లోని మనాలిలో విధుల్లో ఉన్న భారత ఆర్మీ జవాన్ కార్తీక్ కుమార్ రెడ్డి మృతి చెందారు. మనాలిలో మంచు చరియలు విరిగిపడటంతో ఏపీకి చెందిన జవాన్ కార్తీక్ రెడ్డి మృతి చెందారు.

Karthik Kumar Reddy Died : మనాలిలో విరిగిపడ్డ మంచు చరియలు..ఏపీకి చెందిన జవాన్ మృతి

Karthik Kumar Reddy Died

Bharath Army Jawan Karthik Kumar Reddy Died : దేశ రక్షణ కోసం తమ ప్రాణాల్ని పణ్ణంగా పెట్టే జవాన్లు..మండుడెండల్లోను..మైనస్ డిగ్రీల చలిలోను దేశాన్ని..దేశ ప్రజల్ని రక్షించటానికి నిరంతరం వేయి కళ్లతో కాపలా కాస్తుంటారు. శతృవులు ఎవరైనా సరే..ఎంతటివారైనా సరే ఎంతటి బలవంతులైనా సరే దేశం వంక కన్నెత్తి చూస్తే ఖతం చేయటానికి అనుక్షణం అప్రమత్తంగా ఉంటారు. అటువంటి ఓ జవాన్ ప్రకృతి ప్రకోపానికి బలి అయ్యాడు. ఏపీకి చెందిన జవాన్ మనాలిలో విధులు నిర్వహిస్తుండగా..హఠాత్తుగా విరిగిపడ్డ మంచు చరియల్లో చిక్కుకుని దర్మరణంపాలయ్యాడు.దీంతో జవాన్ కార్తీక్ కుమార్ రెడ్డి స్వంత గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

జవాన్ కార్తీక్ కుమార్ రెడ్డిదేశ ప్రజలకు వెలుగులు పంచుతూ దీపావళి రోజే ప్రకృతి ప్రకోపానికి బలి కావడం అత్యంత దురదృష్టకరమైన ఘటనకు బలయ్యాడు. ఎప్పుడు దేశ సేవే పరమావధిగా జీవించే కార్తీక్ కుమార్ సైనికుడిగా ఇండియన్ ఆర్మీలో చేశాడు. విధులు నిర్వహిస్తుండగానే హఠాత్తుగా విరిగిపడ్డ మంచు చరియలకు అసువులు బాశాడు.

ఏపీలోని చిత్తూరు జిల్లా ములకలచెరువు మండలం వేపూరికోట పంచాయతీ బంగారువాండ్లపల్లెకు చెందిన 29 ఏళ్ల పెద్దావుల కార్తిక్‌కుమార్‌రెడ్డి గురువారం (నవంబర్ 4,2021) సాయంత్రం హిమాచల్‌ప్రదేశ్‌ లోని మనాలి సమీపంలో మంచుకొండలు విరిగి పడిన ఘటనలో కార్తిక్‌ మృతి చెందాడు. దీంతో ఆయన ఇంటిలోను గ్రామంలోను విషాదం అలముకుంది. బంధుమిత్రులు కార్తిక్‌తో తమ అనుబంధాన్ని గుర్తు చేసుకుని కన్నీరు మున్నీరయ్యారు. కార్తీక్ కు ఘనంగా నివాళులర్పించారు.

కార్తీక్ రెడ్డి వ్యవసాయం కుటుంబంలో జన్మించాడు. నారాయణరెడ్డి, సరోజమ్మ దంపతులకు కొడుకు కార్తిక్‌కుమార్‌రెడ్డి. కార్తీక్ కు ఓ సోదరుడు ఉన్నాడు. తండ్రి 2020లో అనారోగ్యంతో మరణించాడు. కార్తీక్ కు చిన్నప్పటినుంచి సైన్యంలో పనిచేయాలని ఆకాంక్ష.. అదే లక్ష్యంతో చదువుకున్నాడు. అనుకున్నట్లుగానే 2011లో సైన్యంలో (ఎంఈజీలో) చేరాడు. ముంబయిలో సెయిలింగ్‌(పడవ నడపడం)లో ఉత్తమ ప్రతిభ చూపి పతకం పొందాడు. మొదట జమ్మూకశ్మీర్‌లో, ఆ తర్వాత ముంబయిలో పనిచేశారు.ఈక్రమంలో హిమాచల్‌ప్రదేశ్‌ లోని మనాలి సమీపంలో విధులు నిర్వహిస్తుండగా విరిగిపడ్డ మంచు చరియల్లో మృతి చెందాడు.

దీపావళి పండుగ రోజున ఉదయం కార్తీక్  తల్లితో మాట్లాడారు. దీపావళి శుభాకాంక్షలు తెలిపాడు. అమ్మా బాగున్నావా.. నీ ఆరోగ్యం జాగ్రత్త..అన్నా..కుటుంబంలో అందరూ బాగున్నారా.. అంటూ ఎంతో సంతోషంగా మాట్లాడాడని..కానీ ఇంతలోనే ఇలాంటి కబురు వినాల్సి వస్తుందని అనుకోలేదనీ..నాకొడుకుతో మాట్లాడిన చివరిమాటలు ఇంకా వినిపిస్తున్నట్లే ఉందని తల్లి కన్నీరుమున్నీరుగా విలపిస్తు తెలిపారు.