Newlywed couple reunites: ఒడిశా రైలు ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో కలిసిన నవ దంపతులు
ఒడిశా రైలు ప్రమాదంలో చిక్కుకొని తీవ్రంగా గాయపడిన నవ దంపతులు ఎట్టకేలకు ఆసుపత్రిలో కలిశారు.హౌరా నివాసి అయిన మహ్మద్ రఫీక్, దీపికా పాలి వివాహం జరిగి మూడు రోజులే అయింది. నవ దంపతులు కోరమండల్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తుండగా భారీ ప్రమాదానికి గురయ్యారు....
- saleem sk
- Published On : June 9, 2023 / 07:09 AM IST
Newlywed couple reunites
Newlywed couple reunites: ఒడిశా రైలు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన నవ దంపతులు ఎట్టకేలకు శుక్రవారం కటక్‌లోని శ్రీరామ చంద్ర భంజా మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో(hospital) తిరిగి కలిశారు.హౌరా నివాసి అయిన మహ్మద్ రఫీక్, దీపికా పాలి వివాహం జరిగి మూడు రోజులే అయింది. నవ దంపతులు కోరమండల్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తుండగా భారీ ప్రమాదానికి గురయ్యారు.(Odisha train accident)
Nirmala Sitharaman: బెంగళూరులో నిరాడంబరంగా నిర్మలాసీతారామన్ కుమార్తె వివాహం
తీవ్రంగా గాయపడిన నవ దంపతులు కటక్ ఎస్సీబీ మెడికల్ వైద్యకళాశాలలో విడివిడిగా చేరారు.రెస్క్యూ ఆపరేషన్ సమయంలో మహ్మద్ రఫీక్‌ను ఆసుపత్రికి పంపారు. అక్కడ అతన్ని ట్రామా ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసీయూ)లో చేర్చారు, రఫీక్ భార్య దీపికా పాలి తన భర్త చేరిన ఆసుపత్రిలోనే శస్త్రచికిత్స విభాగంలో చేరారు.
‘‘నా భర్తకు నాకంటే ఎక్కువ గాయాలయ్యాయి. అతనితో పాటు నన్ను కూడా చేర్చుకోవాలని అధికారులను అభ్యర్థించాను, కానీ మమ్మల్ని వేర్వేరు వార్డుల్లో చేరుస్తామని వారు నాకు చెప్పారు’’ అని దీపికా పాలి పేర్కొన్నారు.ఈ రైలు ప్రమాదంలో 288 మంది ప్రాణాలు కోల్పోగా, 900 మందికి పైగా గాయపడ్డారని నివేదికలు చెబుతున్నాయి.
