18 ఏళ్ల యువతికి నడుము నొప్పి వచ్చింది. ఆస్పత్రికి వెళ్తే ఆపరేషన్ చేయాల్సిందేనన్నారు. నడుము నొప్పి ఆపరేషన్ ఏంటో అనుకున్నారు. తీరా ఆపరేషన్ చేశాక.. వాళ్లు బయటకు
18 ఏళ్ల యువతికి నడుము నొప్పి వచ్చింది. ఆస్పత్రికి వెళ్తే ఆపరేషన్ చేయాల్సిందేనన్నారు. నడుము నొప్పి ఆపరేషన్ ఏంటో అనుకున్నారు. తీరా ఆపరేషన్ చేశాక.. వాళ్లు బయటకు తీసిన వస్తువు చూసి ఆశ్చర్యపోయారు. ఆ యువతి నడుములో ఉన్నది ఒక బుల్లెట్. నడుములోంచి దిగి కడుపు దగ్గర ఆగిపోయింది.
బుల్లెట్ ఉన్న కారణంగా కాబోలు.. రెండేళ్లుగా వెన్ను నొప్పితో బాధపడుతోంది అస్మా బేగం. అలా నొప్పి వచ్చినప్పుడల్లా స్థానిక డాక్టర్ దగ్గరికి వెళ్లడం.. మందులు వేసుకోవడంతో సరిపెట్టింది. మళ్లీ మళ్లీ పెయిన్ వస్తుండడంతో ఎక్స్‌రే తీయించారు. మొదట ఏదో చిన్న వస్తువు ఉందని గుర్తించిన అక్కడి డాక్టర్లు.. చిన్న ఆపరేషన్ చేస్తే సరిపోతుందన్నారు. దీంతో బేగంను నిమ్స్‌కి తీసుకెళ్లారు కుటుంబ సభ్యులు.
అస్మా బేగంకి ఆపరేషన్ చేసిన డాక్టర్లు.. నడుము దగ్గర బుల్లెట్ ఉండడం చూసి షాక్ అయ్యారు. వెంటనే పంజాగుట్ట పోలీసులకు సమాచారం ఇచ్చారు. బుల్లెట్ ఎక్కడిది, ఎలా దిగింది అని తేల్చేందుకు ఫలక్‌నుమా పోలీసులు రంగంలోకి దిగారు. ఏసీపీ మజీద్ యువతి ఇంటికి వెళ్లి అన్ని రకాలుగా అడిగి చూశారు. కాని, యువతి మాత్రం తనకేం తెలియదని చెప్పింది.
తల్లిదండ్రుల వర్షన్ మరోలా ఉంది. అమ్మాయికి ఎలాంటి బుల్లెట్ తగల్లేదని చెబుతున్నారు. నిజంగానే బుల్లెట్ శరీరంలో ఉండిపోతే.. ఆరోగ్యం పాడయ్యేదని చెబుతున్నారు. అలాంటిదేం జరగలేదు కాబట్టి.. హాస్పిటల్ వాళ్లే కావాలనే ఇలా చెబుతున్నారని ఆరోపిస్తున్నారు.
నిమ్స్ వైద్యులు మాత్రం.. అస్మా బేగం శరీరంలో రెండు మూడేళ్లుగా బుల్లెట్ ఉన్నట్లు చెబుతున్నారు. పోలీసులు కూడా బుల్లెట్ ఎక్కడి నుంచి వచ్చిందన్నది ఆరా తీస్తున్నారు. అస్మా బేగం కుటుంబం ఫలక్‌నుమాలోని జహ్నుమా ఏరియాలో ఉంటోంది. తండ్రి వాచ్‌మెన్‌గా చేస్తుండగా, బేగం బట్టలు కుడుతుంటుంది. గతంలో యువతి కుటుంబం ఎక్కడ నివాసం ఉండేది, ఆ ప్రాంతంలో ఏదైనా ఫైరింగ్ పాయింట్ ఉందా అనే విషయాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.