అసలేం జరిగింది : ట్రిపుల్ ఐటీ విద్యార్థిని సూసైడ్

కృష్ణా జిల్లా నూజివీడు ట్రిపుల్ ఐటీలో కలకలం రేగింది. ఇంజినీరింగ్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. గల్స్ హాస్టల్ లో ఈ ఘటన జరిగింది. ఫ్యాన్ కి ఉరేసుకుని భాగ్యలక్ష్మి

  • Publish Date - September 1, 2019 / 01:50 PM IST

కృష్ణా జిల్లా నూజివీడు ట్రిపుల్ ఐటీలో కలకలం రేగింది. ఇంజినీరింగ్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. గల్స్ హాస్టల్ లో ఈ ఘటన జరిగింది. ఫ్యాన్ కి ఉరేసుకుని భాగ్యలక్ష్మి

కృష్ణా జిల్లా నూజివీడు ట్రిపుల్ ఐటీలో కలకలం రేగింది. ఇంజినీరింగ్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. గల్స్ హాస్టల్ లో ఈ ఘటన జరిగింది. ఫ్యాన్ కి ఉరేసుకుని భాగ్యలక్ష్మి చనిపోయింది. భాగ్యలక్ష్మి బీటెక్ థర్డియర్ చదువుతోంది. చనిపోవడానికి ముందు భాగ్యలక్ష్మి ఎవరితోనూ వీడియో కాల్ లో మాట్లాడిందని తోటి విద్యార్థులు చెప్పారు. ప్రేమ వ్యవహారమే కారణమై ఉండొచ్చని హాస్టల్ సిబ్బంది అనుమానిస్తున్నారు. 

భాగ్యలక్ష్మిది పశ్చిమగోదావరి జిల్లా గోకవరం. విషయం తెలుసుకుని రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు ప్రారంభించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. సూసైడ్ కి ప్రేమ వ్యవహారమే కారణమా లేక మరొకటా అని ఆరా తీస్తున్నారు. భాగ్యలక్ష్మి సూసైడ్ ఘటన హాస్టల్ లో కలకలం రేపింది. తోటి విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు.