×
Ad

Man Cheated Girl : తనను వదిలేసి వెళ్లిన మొగుడ్ని చొక్కా పుచ్చుకు లాక్కెళ్ళిన భార్య

వాళ్లిద్దరూ ఒకే చోట పని చేస్తున్నారు. ఒకరినొకరు ఇష్టపడ్డారు.. ప్రేమించుకున్నారు... రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. కొన్నాళ్లు కాపురం చేశాక ఆమెను వదిలేసి పారిపోయాడు.

  • Published On : September 13, 2021 / 08:23 PM IST

Orissa Man Cheated Andhra Girl

Man Cheated Girl :  వాళ్లిద్దరూ ఒకే చోట పని చేస్తున్నారు. ఒకరినొకరు ఇష్టపడ్డారు.. ప్రేమించుకున్నారు… రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. కొన్నాళ్లు కాపురం చేశాక ఆమెను వదిలేసి పారిపోయాడు. మొగుడ్ని వెతుక్కుంటూ వెళ్లిన ఆమెకు షాకింగ్ విషయం తెలిసింది. అంతే సమీపంలోని పోలీసు స్టేషన్ కు మొగుడ్ని చొక్కాపట్టుకు ఈడ్చుకు వెళ్లింది.

ఒడిషాలోని  రాయగడ జిల్లాలోని   బిసంకటక్ సమితిలో చోటు చేసుకున్న ఈఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.   బిసంకటక్ సమితి పరిధిలోని కుంకుబడి గ్రామానికి చెందిన సుమన్ కుసులియా ఉపాధికోసం 6 నెలల క్రితం ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమగోదావరి జిల్లా   భీమవరం లోని రొయ్యల పరిశ్రమలో చేరాడు.  అక్కడే పని చేస్తున్న విశాఖ జిల్లా పాడేరుకు చెందిన యువతి బెలసుర కుమారితో పరిచయమయ్యింది. ఈక్రమంలో ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది.
Read Also : AP : పెట్రోల్ పోయించుకుంటున్నారా ? గమనించండి..మోసపోకండి

3 నెలల క్రితం ఇద్దరూ సమీపంలోని ఆలయంలో రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. పెళ్లి అయిన తర్వాత ఇద్దరూ కాపురం పెట్టారు. కొన్నాళ్లు కలిసి కాపురం చేశాక సుమన్ ఒకరోజు ఎవరికీ  చెప్పకుండా భీమవరం నుంచి  బిసంకటక్ వెళ్లి పోయాడు. రోజులు గడుస్తున్నా భర్త ఇంటికి తిరిగి రాకపోవటంతో మోస పోయానని గ్రహించింది. భర్త ఆచూకి కోసం ఆరా తీసింది.

స్వగ్రామంలో ఆటో నడుపుకుని జీవిస్తున్నాడని తెలుసుకుంది. తన అన్నయ్యను తీసుకుని గత శుక్రవారం, సెప్టెంబర్ 10 రాత్రికి  బిసంకటక్ చేరుకుంది. శనివారం ఉదయం ఆటోస్టాండ్‌లో   వేచి ఉండగా సుమన్ కనపడ్డాడు.  భర్తను నిలదీసింది. తనతో రమ్మని వేడుకుంది. అతడు అంగీకరించలేదు.

Read Also : Man Hacked To Death : యువతికి వాట్సప్ మెసేజ్‌లు పంపించాడని యువకుడి హత్య

తనకు కొద్దిరోజుల క్రితం వేరే అమ్మాయితో వివాహం జరిగిందని చెప్పాడు. దీంతో ఆమెలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది.  అందరూ చూస్తుండగా చొక్కా కాలర్ పుచ్చుకుని  బిసంకటక్ పోలీసు స్టేషన్ కు ఈడ్చుకుంటూ వెళ్ళింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేయనప్పటికీ సుమన్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.