AP : పెట్రోల్ పోయించుకుంటున్నారా ? గమనించండి..మోసపోకండి

ధరలు ఎంత స్పీడ్‌గా పెరుగుతున్నాయో.. పెట్రోల్ బంకుల్లో మోసాలు కూడా అదే రేంజ్‌లో పెరుగుతున్నాయి. చాలా బంకుల్లో ఇప్పుడు పెట్రోల్‌ మాఫియా చెలరేగిపోతోంది.

AP : పెట్రోల్ పోయించుకుంటున్నారా ? గమనించండి..మోసపోకండి

Petrol

Petrol Pump Cheat Chips : ఏపీలో పెట్రోల్ పోయించుకుంటున్నారా ? గమనించండి..మోసపోకండి. ధరలు ఎంత స్పీడ్‌గా పెరుగుతున్నాయో.. పెట్రోల్ బంకుల్లో మోసాలు కూడా అదే రేంజ్‌లో పెరుగుతున్నాయి. ఓ వైపు వినియోగదారులను ధరలు బాదేస్తుంటే.. మరోవైపు కొలతల్లో తేడాలు జేబుకు చిల్లు పెడుతున్నాయి. ఏపీలోని చాలా బంకుల్లో ఇప్పుడు పెట్రోల్‌ మాఫియా చెలరేగిపోతోంది. పెట్రోలు బంకుల్లో ఇప్పటివరకూ సిబ్బంది చేతివాటం మాత్రమే కనిపించేది.

Read More : Petrol : ఆ పెట్రోల్ బంక్ లో.. లీటర్ పెట్రోల్ ఉచితం

ఇప్పుడు జరుగుతున్న పెట్రో దందా.. అంతకు మించి అన్నట్లు ఉంది. ఏపీలోని పెద్ద నగరాలను స్థావరాలుగా చేసుకున్న ముఠాలు.. టెక్నాలజీతో వినియోగదారులను బురిడీ కొట్టిస్తున్నాయి. ముంబై లింక్స్‌తో పనిచేసే ఈ ముఠాలకు.. సాంకేతిక సహకారం చైనాలోని ముఠాల నుంచి అందుతోందని గుర్తించారు అధికారులు.  పెట్రోల్, డీజల్ బంకుల్లో జరుగుతున్న మోసాలతో వినియోగదారులు తీవ్రంగా నష్టపోతున్నారు.

Read More : Adulterated Petrol : కల్తీ పెట్రోల్ కలకలం.. పెట్రోల్‌కి బదులు నీళ్లు, షాక్‌లో వాహనదారులు

ఈ మోసాలను అరికట్టేందుకు తూనికలు, కొలతల శాఖ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఏపీ వ్యాప్తంగా పదిహేడు బంకులను సీజ్‌ చేసి కేసు నమోదు చేశారు. విజయవాడ గుణదలలో ఓ బంకును సీజ్‌ చేశారు. పెట్రోల్‌ బంకుల్లో మోసాలు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెబుతున్నారు అధికారులు. పెట్రోల్‌ బంకులపై ఎలాంటి అనుమానం వచ్చినా.. తమకు ఫిర్యాదు చేస్తే వెంటనే చర్యలు తీసుకుంటామని డీసీ కృష్ణ చైతన్య వెల్లడించారు.