రెచ్చిపోయిన చైన్ స్నాచర్లు : ప్రధాని మోడీ బంధువు పర్సు చోరీ

దేశ రాజధానిలో ఢిల్లీలో చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. ఏకంగా ప్రధాని నరేంద్ర మోడీ తమ్ముడి కూతురు దమయంతి బెన్ మోడీ పర్సును ఎత్తుకెళ్లారు. బైక్ పై స్నాచర్లు.. దమయంతి

  • Publish Date - October 12, 2019 / 03:45 PM IST

దేశ రాజధానిలో ఢిల్లీలో చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. ఏకంగా ప్రధాని నరేంద్ర మోడీ తమ్ముడి కూతురు దమయంతి బెన్ మోడీ పర్సును ఎత్తుకెళ్లారు. బైక్ పై స్నాచర్లు.. దమయంతి

దేశ రాజధానిలో ఢిల్లీలో చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. ఏకంగా ప్రధాని నరేంద్ర మోడీ తమ్ముడి కూతురు దమయంతి బెన్ మోడీ పర్సును ఎత్తుకెళ్లారు. బైక్ పై స్నాచర్లు.. దమయంతి చేతిలో ఉన్న పర్సుని లాక్కుని పారిపోయారు. శనివారం(అక్టోబర్ 12,2019) ఢిల్లీలోని సివిల్ లైన్స్‌ దగ్గర ఈ చోరీ జరిగింది. గుజరాతీ సవాజ్ భవన్ బయట ఆటో నుంచి దమయంతి దిగుతోంది. సరిగ్గా అదే సమయంలో స్నాచర్లు వచ్చారు. ఆమె పర్సు కొట్టేసి ఉడాయించారు. పర్సులో రూ.56వేల క్యాష్, 2 మొబైల్ ఫోన్లు, కొన్ని కీలక డాక్యుమెంట్లు ఉన్నట్టు దమయంతి బెన్ తెలిపారు. దీనిపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఇంటికి సమీపంలోనే ఈ చోరీ జరిగింది.
 
దమయంతి బెన్ మోడీ శనివారం ఉదయం అమృత్‌సర్ నుంచి ఢిల్లీకి వచ్చారు. గుజరాతీ సమాజ్ భవన్‌లో ఒక గది కూడా బుక్ చేసుకున్నారు. షెడ్యూల్ ప్రకారం సాయంత్రం ఢిల్లీ నుంచి అహ్మదాబాద్‌కు వెళ్లాల్సి ఉంది. ఇంతలో షాకింగ్ ఘటన జరిగింది. స్నాచింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

రైల్వేస్టేషన్ నుంచి సివిల్ లైన్స్ వరకూ సీసీటీపీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు. త్వరలోనే స్నాచర్లను అరెస్ట్ చేస్తామన్నారు. ఢిల్లీ వీధుల్లో చైన్ స్నాచర్ల ఆగడాలు పెరిగాయి. బైక్ పై వస్తున్న దుండగలు.. కళ్లు మూసి తెరిచేలోగా చైన్లు, పర్సులు లాక్కుని వెళ్లిపోతున్నారు. ఇప్పటికే చాలామంది బాధితులు ఉన్నారు. పోలీసులు నిఘా పెంచినా చైన్ స్నాచర్ల ఆగడాలు తగ్గడం లేదు.