×
Ad

Falaknuma Dancer : డ్యాన్స్ ఆపేస్తే పెళ్లి చేసుకుంటా..పాతబస్తీ డ్యాన్సర్ హత్య కేసు

పాతబస్తీలో సంచలనం సృష్టించిన డ్యాన్సర్ ఫాతిమా హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వివాహేతర సంబంధమే హత్యకు కారణమని తేల్చారు.

  • Published On : November 10, 2021 / 08:31 AM IST

Old City

Dancer Old City : హైదరాబాద్ పాతబస్తీలో సంచలనం సృష్టించిన డ్యాన్సర్ ఫాతిమా హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వివాహేతర సంబంధమే హత్యకు కారణమని తేల్చారు. క్యాబ్‌ డ్రైవర్‌ మహ్మద్‌ అప్సర్‌తోపాటు రేస్‌ కోర్స్‌ బుకీ నహీద్‌ను పోలీసులు అరెస్టు చేసి విచారించగా అసలు నిజం వెలుగులోకి వచ్చింది.

Read More : Covid Certificate: చనిపోయిందని కుటుంబ సభ్యులు చెప్పాక టీకా వేసి మెసేజ్ పంపారు!!

ఏడాది క్రితం ఫాతిమా భర్త మృతి చెందడంతో క్యాబ్‌ డ్రైవర్‌తో ఆమెకు వివాహేతర సంబంధం ఏర్పడినట్లు విచారణలో తేలింది, ఇటీవల పెళ్లి చేసుకోవాలంటూ డ్రైవర్‌పై ఫాతిమా ఒత్తిడి తీసుకొచ్చింది. డ్యాన్స్ లు ఆపేస్తే పెళ్లి చేసుకుంటానని డ్రైవర్‌ ఫాతిమాకు షరతు పెట్టాడు. దీంతో వివాహ విషయంలో క్యాబ్‌ డ్రైవర్‌, ఫాతిమాకు మధ్య వివాదం చోటుచేసుకుంది. దీంతో క్యాబ్‌ డ్రైవర్‌ అప్సర్‌ అతని స్నేహితుడు నహీద్‌ కలిసి ఫాతిమాను హత్య చేశారు. ఆమెకు మద్యం తాగించి ఉరి వేసి చంపేశారు. కేసు నమోదు చేసిన ఫలక్‌నామా పోలీసులు… పక్కా ఆధారాలతో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

Read More : India Petrol : స్థిరంగా చమురు ధరలు, ఏ నగరంలో ధర ఎంతంటే ?

ముస్తఫానగర్‌కు చెందిన 30 ఏళ్ల షరీన్‌ ఫాతిమా భర్త నదీమ్ ఏడాది కిందట మృతి చెందాడు. ఆమెకు ఏడుగురు సంతానం ఉన్నారు. వీరందరినీ ఆర్కెస్ట్రా ట్రూప్ డ్యాన్సర్‌గా పనిచేస్తూ ఫాతిమానే పోషించుకునేది. అయితే ఈ క్రమంలోనే ఫాతిమకు మహమ్మద్ అప్సర్ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. అతడితో వివాహేతర సంబంధం కొనసాగించింది. ప్రస్తుతం అతడి చేతిలోనే ఫాతిమా మరణించడంతో  పిల్లలు అనాథలుగా మారారు.