Covid Certificate: చనిపోయిందని కుటుంబ సభ్యులు చెప్పాక టీకా వేసి మెసేజ్ పంపారు!!

కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు వ్యాక్సిన్ పంపిణీ దేశవ్యాప్తంగా ముమ్మరంగా జరుగుతుంది. ఈ క్రమంలో క్షేత్ర స్థాయి నుంచి అధికారుల వరకూ అందరూ అప్రమత్తంగా ఉండి చర్యలు తీసుకోవాల్సి ఉంది.

Covid Certificate: చనిపోయిందని కుటుంబ సభ్యులు చెప్పాక టీకా వేసి మెసేజ్ పంపారు!!

Covuid Vaccine

Covid Certificate: కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు వ్యాక్సిన్ పంపిణీ దేశవ్యాప్తంగా ముమ్మరంగా జరుగుతుంది. ఈ క్రమంలో క్షేత్ర స్థాయి నుంచి అధికారుల వరకూ అందరూ అప్రమత్తంగా ఉండి చర్యలు తీసుకోవాల్సి ఉంది. మొదటి డోసు, రెండో డోసుల కోసం ఎదురుచూసి.. స్లాట్ బుక్ చేసుకుని వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి చేసుకుంటుంటే.. కొద్దిమంది సిబ్బంది నిర్లక్ష్యంతో వ్యాక్సిన్ల అవకతవకలు జరుగుతూనే ఉన్నాయి.

కొవిడ్ వ్యాక్సిన్ రెండో టీకా తీసుకున్నట్లుగా సర్టిఫికేట్ కూడా ఇచ్చారు అధికారులు. దమ్మాయిగూడకు చెందిన కె.కౌసల్య(81) మే 4న కరోనా వ్యాక్సిన్‌ మొదటి డోసు తీసుకుంది. రెండు నెలల తర్వాత అనారోగ్యంతో కనుమూసింది. ఈ విషయం తెలియక రెండో డోసు టీకా గడువు సమీపిస్తుందంటూ మృతురాలైన కౌశల్య కుటుంబ సభ్యులకు సిబ్బంది ఫోన్‌ చేశారు. దానికి సమాధానంగా మరణించి మూడు నెలలవుతున్నా.. బదులిచ్చారు.

నవంబర్‌ 8న అంటే 15 రోజుల తర్వాత కౌసల్య రెండో డోసు వ్యాక్సిన్ తీసుకున్నట్లు సందేశం వచ్చింది. కుటుంబ సభ్యులు చనిపోయిన వ్యక్తికి రెండో డోసు ఎలా వేశారంటూ షాక్ అయ్యారు. నిర్దేశించిన లక్ష్యాలు పూర్తి చేసుకోవాలని.. సిబ్బంది ఇటువంటి ఘటనలు చేసినట్లు భావిస్తున్నారు.

……………………………………..: చరిత్ర సృష్టించిన జైభీమ్.. 26 ఏళ్ల రికార్డ్ బద్దలు!