Shameless Influencer (Photo Credit : Google)
Shameless Influencer : సోషల్ మీడియాలో పాపులర్ అయ్యేందుకు కొందరు దిగజారిపోతున్నారు. జాలి, దయ, కనికరం అన్నది లేకుండా కసాయిలా మారుతున్నారు. తమ ఆనందం కోసం వికృత చర్యలతో సైకోలను తలపిస్తున్నారు. తమ వీడియోలు వైరల్ చేసుకునేందుకు ఎదుటి వారిని హింసించడానికి, వేధించడానికి కూడా వెనుకాడటం లేదు. పిచ్చి పిచ్చి వేషాలతో పైశాచిక ఆనందం పొందుతున్నారు.
తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యేందుకు ఓ పోకిరీ నీచానికి ఒడిగట్టాడు. సైకిల్ పై వెళ్తున్న వృద్ధుడి ముఖంపై స్నో స్ప్రే చేసి పైశాచిక ఆనందం పొందాడు. ఆ పోకిరీ అనుకున్నట్లే.. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. అయితే, అతడు అనుకున్నది ఒకటి, అక్కడ జరిగింది మరొకటి. అతడు చేసిన పనిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. నీ ఆనందం కోసం అంత పెద్దాయనను బాధ పెడతావా అంటూ అంతా మండిపడ్డారు. వృద్ధుడిని బాధ పెట్టిన ఆ నీచుడిని కఠినంగా శిక్షించాలనే డిమాండ్లు వెల్లువెత్తాయి.
ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఝాన్సీలో జరిగింది. ఆ యువకుడి చర్యతో పాపం ఆ పెద్దాయన ఎంత బాధపడ్డాడో, ఎంత వేదన అనుభవించాడోనని నెటిజన్లు వాపోతున్నారు. ఇంతటి నీచానికి ఒడిగట్టిన ఆ యువకుడిపై అటెంప్ట్ మర్డర్ కేసు నమోదు చేయాలని కొందరు డిమాండ్ చేశారు. స్ప్రే కొట్టడంతో ఆ పెద్దాయన పొరపాటున బ్యాలెన్స్ కోల్పోయి రోడ్డు మీద పడి ఉంటే ఎవరూ ఊహించని రీతిలో ఘోర ప్రమాదం జరిగి ఉండేదని, ఆయన ప్రాణాలకే ప్రమాదం కలిగేదని మరికొందరు ఆందోళన వ్యక్తం చేశారు.
Also Read : ఛీ..ఛీ.. వీరి వికృత చేష్టలు చూశాక జన్మలో బయట ఫుడ్ తినరేమో? వీడియో వైరల్..
ఇంకేముంది.. మ్యాటర్ పోలీసుల వరకు వెళ్లింది. రంగంలోకి దిగిన ఖాకీలు.. ఆ పని చేసిన వెధవను వెతికి మరీ పట్టుకున్నారు. అరెస్ట్ చేసి కటకటాల్లోకి పంపారు. కాగా, స్టేషన్ లోకి తీసుకెళ్లాక పోలీసులు ఆ యువకుడికి తమ స్టైల్ లో మర్యాదలు చేసినట్ల తెలుస్తోంది. స్టేషన్ నుంచి బయటకు వస్తున్న సమయంలో సదరు యువకుడు నడిచేందుకు ఇబ్బంది పడ్డాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. దీన్ని బట్టి.. ఆ పోకిరీకి తగిన శాస్తి జరిగినట్లే ఉందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇక ముందు ఇలాంటి వెధవ పనులు చేయొద్దని, లేదంటే మరోసారి స్ట్రాంగ్ కోటింగ్ ఉందని పోలీసులు గట్టిగానే వార్నింగ్ ఇచ్చారట. అంతేకాదు.. వీడియోల కోసం ఇలాంటి చిల్లర పనులు చేసి ప్రజలను ఇబ్బంది పెడితే ఊరుకునేది లేదని, తాట తీస్తామని వార్నింగ్ ఇచ్చారు పోలీసులు.
हे भगवान….जाने कहां चले गए सभ्यता, संस्कृति और संस्कार!#UP के झांसी में साइकिल सवार राहगीर बुजुर्ग से निहायती तुच्छ हरकत का #VideoViral pic.twitter.com/0XtGEy70t6
— Himanshu Tripathi (@himansulive) September 22, 2024
शाबाश @Uppolice
चलती राह बुजुर्ग से खिलवाड़ करने वाले साहब पुलिस कस्टडी में…..इनकी चाल बता रही है कि इस तरह का खिनौना कृत्य ये जीवन में दोबारा न करेंगे!! https://t.co/4ZpX8PKJBs pic.twitter.com/k01u6TmkoD
— Himanshu Tripathi (@himansulive) September 22, 2024