ఛీ..ఛీ.. వీరి వికృత చేష్టలు చూశాక జన్మలో బయట ఫుడ్ తినరేమో? వీడియో వైరల్..
ఈ రెండు వీడియోలు చూశాక.. అంతా బెంబేలెత్తిపోతున్నారు. వీళ్లసలు మనుషులేనా అని మండిపడుతున్నారు.

Viral Videos (Photo Credit : Google)
Viral Videos : మనలో చాలామంది స్ట్రీట్ ఫుడ్ లవర్స్ ఉన్నారు. ఎక్కువమందికి బయట దొరికే ఆహారం తినడం అంటే చాలా ఇష్టం. రోడ్డు మీదకు వెళితే చాలు.. ఏది కనిపిస్తే అది లాగించే వాళ్లు ఉన్నారు. ఫ్రైడ్ రైస్, గోబీ, పానీపూరి, జ్యూసులు.. ఇలా రకాల ఫుడ్స్, డ్రింక్స్ ను ఇష్టపడే వారు ఉన్నారు. అయితే, ఇక ముందు బయట ఫుడ్ తినే ముందు జాగ్రత్త పడాల్సిన సమయం వచ్చేసింది.
ఎందుకంటే.. కొందరు వ్యాపారులు దారుణానికి ఒడిగడుతున్నారు. వారు చేసే వికృత చేష్టలు చూస్తే కడుపులో తిప్పేయడం ఖాయం. వాంతి చేసుకోవడం కన్ ఫర్మ్. బయటి ఫుడ్ తినాలంటేనే భయపడిపోయేలా కొందరు వ్యాపారులు చేష్టలు ఉన్నాయి. అంతేకాదు.. బయట ఎక్కడ పడితే అక్కడ పండ్లు, కూరగాయలు కొన్నాలన్నా భయపడాల్సిన పరిస్థితిని తీసుకొచ్చారు కొందరు నీచులు.
అసలేం జరిగిందంటే.. ఓ పళ్ల వ్యాపారి తన బండికి ఉన్న ప్లాస్టిక్ బ్యాగ్ లో మూత్ర విసర్జన చేశాడు. ఆ తర్వాత అదే చేత్తో కస్టమర్లకు ఫ్రూట్స్ అమ్ముతున్నాడు. ఈ దారుణం మహారాష్ట్రలోని ధానేలో వెలుగుచూసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. డోంబివలీలో ప్రాంతంలో ఈ నీచుడు పండ్ల వ్యాపారం చేస్తున్నాడు. తన బండి దగ్గరే ప్లాస్టిక్ బ్యాగ్ లో మూత్ర విసర్జన చేశాడు. బండి దగ్గరే మూత్ర విసర్జన చేయడం ఒక నేరం అయితే, చేతులు శుభ్రం చేసుకోకుండానే అదే చేత్తోతో పండ్లు విక్రయించడం మరో దారుణం.
ఈ వీడియో ఎంత వైరల్ అయ్యిందంటే.. మ్యాటర్ పోలీసుల వరకు వెళ్లింది. దీన్ని సీరియస్ గా తీసుకున్న పోలీసులు.. వెంటనే రంగంలోకి దిగారు. నీచానికి ఒడిగట్టిన 20ఏళ్ల పండ్ల వ్యాపారి అలీ ఖాన్ ను అరెస్ట్ చేశారు. పలు సెక్షన్ల కింద అతడిపై కేసులు నమోదు చేశారు. భారతీయ న్యాయ సంహితలోని 271 (నిర్లక్ష్య పూరి చర్య ప్రాణాంతకమైన వ్యాధి సోకే అవకాశం), 272 (ప్రాణాంతక చర్య ప్రాణాంతకమైన వ్యాధిని వ్యాప్తి చేసే అవకాశం) 296 (అశ్లీలత) సెక్షన్ల కింద కేసు బుక్ చేశారు.
ఇక ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోనూ ఈ తరహా దారుణమే మరొకటి వెలుగు చూసింది. మరో నీచుడు బరితెగించాడు. ఆ జ్యూస్ వ్యాపారి.. తాను తయారు చేసే పళ్ల రసంలో ఉమ్మి వేస్తున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సైతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. షామ్లీలో ఈ ఘోరం జరిగింది.
Also Read : దారుణం.. మహిళను చంపి 30 ముక్కలు చేసి ఫ్రిడ్జ్‌లో దాచి..
ఈ రెండు వీడియోలు చూశాక.. అంతా బెంబేలెత్తిపోతున్నారు. వీళ్లసలు మనుషులేనా అని మండిపడుతున్నారు. ఇక, జీవితంలో బయటి ఫుడ్ తినకపోవడమే బెటర్ ఏమో అనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కాగా, వికృత చర్యలకు పాల్పడిన ఇలాంటి వారిని అత్యంత కఠినంగా శిక్షించాలనే డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి.
फल विक्रेताओं की नहीं रुक रही शर्मनाक हरकतें
मुंबई के डोंबिवली इलाके में फल विक्रेता की करतूत, पेशाब करने के बाद उसी ठेले में थैली रख फिर बेचने लगा फल। कैमरे में क़ैद हुआ वीडियो pic.twitter.com/uXJzeELNI8
— Janta Journal (@JantaJournal) September 22, 2024
यूपी के शामली में जूस में थूकते हुए का वीडियो आया सामने। जूस के ठेले पर जूस बनाते समय थूकता हुआ दिखा। इससे पहले भी ऐसे कई वीडियो सामने आ चुके है। इसलिए जूस पीते समय सावधानी बरतिए… @Uppolice #Shamil pic.twitter.com/DHpupQXPP4
— Arun (आज़ाद) Chahal 🇮🇳 (@arunchahalitv) September 23, 2024