దారుణం.. మహిళను చంపి 30 ముక్కలు చేసి ఫ్రిడ్జ్‌లో దాచి..
ఈ దారుణం గురించి తెలిసి స్థానికులు షాక్ కి గురయ్యారు. భయంతో వణికిపోయారు.

Womans Body Chopped And Stored (Photo Credit : Google)
Womans Body Chopped : దేశవ్యాప్తంగా సంచలనం రేపిన శ్రద్దావాకర్ ఘటన గుర్తుంది కదూ. శ్రద్దా వాకర్ ను చంపి డెడ్ బాడీని ముక్కలు చేసిన సంగతి తెలిసిందే. దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఈ క్రైమ్ ఇన్సిడెంట్ యావత్ దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. తాజాగా అదే తరహా దారుణం ఒకటి బెంగళూరులో వెలుగుచూసింది. ఓ ఇంట్లో మహిళ (29) దారుణ హత్యకు గురైంది. ఆమెను హత్య చేసి 30 ముక్కలుగా నరికి శరీర భాగాలను ఫ్రిడ్జ్ లో దాచి ఉంచారు. కొన్ని రోజుల క్రితం ఈ మర్డర్ జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. బెంగళూరులని వ్యాలికావల్ లో ఈ ఘోరం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లారు. 165 లీటర్ల కెపాసిటీ గల ఫ్రిడ్జ్ లో శరీర భాగాలను ఉంచారు.
మృతురాలిని మహాలక్ష్మిగా పోలీసులు గుర్తించారు. ఆమె ఓ మాల్ లో పని చేస్తోంది. మహాలక్ష్మి తన భర్తతో విడిపోయిందని, ఒంటరిగా వ్యాలికావల్ లో నివాసం ఉంటోందని పోలీసులు తెలిపారు. భవనంలోని ఫస్ట్ ఫ్లోర్ లో ఆమె నివాసం ఉంటుంది. గ్రౌండ్ ఫ్లోర్ లో ఇంటి యజమాని ఉంటాడు. మహాలక్ష్మి గత 5 నెలల నుంచి ఆ ఇంట్లో నివాసం ఉంటోంది. ఇంట్లో చేరిన కొత్తలో ఆమె సోదరుడు కూడా ఉండేవాడు. ఆ తర్వాత ఆమె ఒంటరిగా ఉంటోంది.
కాగా, కొన్ని రోజులుగా ఆమెను పికప్ చేసుకునేందుకు, తిరిగి డ్రాప్ చేసేందుకు ఓ యువకుడు వచ్చేవాడని స్థానికులు తెలిపారు. అతడే మహిళను హత్య చేసి ఉంటాడని అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు చేపట్టారు. అసలేం జరిగింది? ఎవరు చంపారు? ఇంత కిరాతకంగా ఎందుకు మర్డర్ చేశారు? అన్న మిస్టరీని చేధించే పనిలో పడ్డారు. ఈ దారుణం గురించి తెలిసి స్థానికులు షాక్ కి గురయ్యారు. భయంతో వణికిపోయారు. సెప్టెంబర్ 2వ తేదీన లేదా ఆ తర్వాత మహాలక్ష్మి హత్యకు గురై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. సరిగ్గా సెప్టెంబర్ 2 నుంచి ఆమె సెల్ ఫోన్ స్విచ్చాఫ్ అయ్యందన్నారు. ఇన్ని రోజులుగా కుటుంబసభ్యులు ఎవరూ మహాలక్ష్మితో మాట్లాడకపోవడం చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని పోలీసులు అంటున్నారు. ఈ వ్యవహారంలో కుటుంబసభ్యులను కూడా విచారిస్తామన్నారు.
మృతురాలు ఇరుగు పొరుగు వారితో పెద్దగా మాట్లాడేది కాదని తెలిసింది. అసలు ఆమెకు పెళ్లైంది అన్న సంగతి కూడా తమకు తెలియదని స్థానికులు చెబుతున్నారు. తమకు తెలిసిందల్లా ఆమె ఓ మాల్ లో జాబ్ చేస్తుంది. ఉదయం 9.30గంటలకు వెళ్తుంది. రాత్రి 10.30 గంటలకు ఇంటికి వస్తుంది అని మహాలక్ష్మి ఇంటి పక్కన ఉండే వాళ్లు పోలీసులతో చెప్పారు. కాగా, హంతకుడు మహిళకు బాగా తెలిసిన వాడే అయ్యి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
కాగా, దేశ రాజధాని ఢిల్లీలోనూ ఇలాంటి ఘటన ఒకటి 2002లో జరిగింది. శ్రద్ధా వాకర్ అనే మహిళను ఆమె బాయ్ ఫ్రెండ్ అత్యంత కిరాతకంగా చంపేశాడు. ఆ తర్వాత మృతదేహాన్ని 35 ముక్కలుగా నరికాడు. అనంతరం శరీర భాగాలను మహిళ నివాసం ఉండే ఇంటికి సమీపంలోని అటవీ ప్రాంతంలో పారేశాడు.
Also Read : బీకేర్ ఫుల్.. కొరియర్ పేరుతో ఘరానా మోసం, 20లక్షలు పొగొట్టుకున్న టెకీ..