HRపై Fake Rape కేసు: లక్షల్లో డిమాండ్

ఆఫీసుల్లో పనిచేసే HRతో ఉన్న సాన్నిహిత్యాన్ని మరోలా వాడుకుందీ యువతి. పూణెకు చెందిన కంపెనీలో HRను బుట్టలో వేసింది. అందరి ముందు కలిసి తిరుగుతూ సాన్నిహిత్యం ఉన్నట్లు నటించింది. కొద్ది రోజుల తర్వాత ఆ వ్యక్తి నన్నురేప్ చేశాడంటూ కేస్ పెట్టింది. అంతే ఉద్యోగం ఊడిపోతుందనే భయంతో బేరానికొచ్చాడు ఆ హెచ్ఆర్. 

ఇందులో భాగంగా తొలి వాయిదా అమౌంట్ కూడా ఇచ్చేశాడు. రూ.45వేలు తీసుకున్న ఆ మహిళ మొత్తంగా రూ.7లక్షలకు సెటిల్‌మెంట్ చేసుకుంది. ఒకవేళ తాను ఆ డబ్బు ఇవ్వలేకపోతే రేప్ కేస్ పెడతానని చెప్పింది. నిర్ణయించుకున్న వాయిదా కంటే ముందే డబ్బులు అడుగుతుండటంతో అతను పోలీసులను ఆశ్రయించి మొత్తం విషయం చెప్పాడు. 

శనివారం పోలీసులు కంప్లైంట్ తీసుకుని ఆ మహిళను దోపిడీ కేసుకింద అదుపులోకి తీసుకున్నారు. ఆ యువతిని ట్రాప్ చేసిన ఇన్‌స్పెక్టర్ రాజేంద్ర మోహిల్, సబ్ ఇన్‌స్పెక్టర్ నీలేశ్ కుమార్ మహాదిక్ ఆమెను పట్టుకోగలిగారు. విచారణలో ఆ మహిళ పలు కంపెనీల హెచ్ఆర్ ఉద్యోగులతో సంబంధాలు పెట్టుకుని, సాన్నిహిత్యంగా ఉంటుందని తేలింది. 

ఫ్రెండ్లీ రిలేషన్ మెయింటైన్ చేస్తూ.. ఆ తర్వాత డబ్బులు డిమాండ్ చేస్తుందని తెలిసింది. ప్రైవేట్ గా కలుద్దామని చెప్పడం, ఆ తర్వాత రేప్ కేసు పెడతానని బెదిరించడం అని తెలుసుకున్నారు. జనవరి 29వరకూ ఆమెను విచారించాలని కోర్టు రిమాండ్‌కు పంపింది.