Harassment On Woman : కోరిక తీర్చమని కార్మికురాలికి వేధింపులు…..!
కాంట్రాక్ట్ పధ్ధతిలో పని చేస్తున్నకార్మికురాలిని ఉద్యోగం ఉండాలంటే తన కోరిక తీర్చాలని వేధిస్తున్న రైల్వే కాంట్రాక్టర్‌కు మహిళా సంఘాలు దేహశుధ్ది చేసిన ఘటన తిరుచానూర్‌లో చోటు
- chvmurthy
- Published On : October 8, 2021 / 01:20 PM IST
Molestation
Harassment On Woman : కాంట్రాక్ట్ పధ్ధతిలో పని చేస్తున్నకార్మికురాలిని ఉద్యోగం ఉండాలంటే తన కోరిక తీర్చాలని వేధిస్తున్న రైల్వే కాంట్రాక్టర్‌కు మహిళా సంఘాలు దేహశుధ్ది చేసిన ఘటన తిరుచానూర్‌లో చోటు చేసుకుంది. గుణశేఖర్ అనే వ్యక్తి తిరుపతిలో రైల్వే కాంట్రాక్టర్ సూపర్‌వైజర్‌గా పని చేస్తున్నాడు. తనకింద పనిచేసే కాంట్రాక్ట్ కార్మికురాలిని ఒకామెను లైంగికంగా వేధించసాగాడు.
ఉద్యోగం ఉండాలంటే తన కోరిక తీర్చమని గత కొన్నిరోజులుగా వేధింపులకు గురి చేస్తున్నాడు. దీంతో బాధితురాలు ఐద్వా సభ్యులను సంప్రదించింది. వారి సహకారంతో గుణశేఖర్ చెప్పిన తిరుచానూర్ లోని ఓ లాడ్జ్ వద్దకు వెళ్లింది. ఆమెను అనుసరించి వెళ్లిన ఐద్వా నాయకురాళ్లు గుణశేఖర్ కు దేహశుధ్ధి చేసి తిరుచానూర్ పోలీసులకు అప్పగించారు. గుణశేఖర్ పై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Also Read : Women Trafficking : 75 మందిని పెళ్లి చేసుకుని 200 మందిని వేశ్యలుగా మార్చిన మోసగాడు
