Women Trafficking : 75 మందిని పెళ్లి చేసుకుని 200 మందిని వేశ్యలుగా మార్చిన మోసగాడు

ఉద్యోగాల పేరుతో బంగ్లాదేశ్ యువతులను భారత్ తీసుకు వచ్చి వారితో వ్యభిచారం నిర్వహిస్తున్న బంగ్లాదేశ్ పౌరుడ్నిఇండోర్ పోలీసులు అరెస్ట్ చేశారు.

Women Trafficking : 75 మందిని పెళ్లి చేసుకుని 200 మందిని వేశ్యలుగా మార్చిన మోసగాడు

Bangaladesi Man Arrested

Women Trafficking : ఉద్యోగాల పేరుతో బంగ్లాదేశ్ యువతులను భారత్ తీసుకు వచ్చి వారితో వ్యభిచారం నిర్వహిస్తున్న బంగ్లాదేశ్ పౌరుడ్నిఇండోర్ పోలీసులు అరెస్ట్ చేశారు. బంగ్లాదేశ్ లోని జషోర్ నివాసి అయిన మనీరుల్ అలియాస్ మునీర్ గాజీ కొన్నేళ్ల క్రితం గుజరాత్ లోని సూరత్ వచ్చి స్ధిరపడ్డాడు. బంగ్లాదేశ్ లోని బీద బాలికలకు, యువతులకు భారత్ లో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్ సరిహద్దుల ద్వారా భారత్ తీసుకువచ్చేవాడు.

సరిహద్దులోని అధికారులకు లంచం ఇచ్చి యువతులను అక్రమంగా కలకత్తా తీసుకు వచ్చేవాడు. అక్కడ కొన్నాళ్లు ఉంచి వారికి ఇంగ్లీషు మాట్లడటంలోనూ, అందంగా కురచ దుస్తులు ధరించటంలో శిక్షణ ఇప్పించ్చేవాడు. అప్పుడే వారికి ఆధార్‌కార్డు, పాన్‌కార్డు లాంటి వాటిని తీసుకునే వాళ్లు. అనంతరం వారిని ముంబై తీసుకువెళ్లేవాడు. అక్కడ వారికి మత్తు మందులు అలవాటు చేసేవాడు. అనంతరం వారిని బలవంతంగా వ్యభిచార కూపంలోకి దించేవాడు.

Also Read : Child Porn Videos : చైల్డ్ పోర్న్ వీడియోలు అమ్ముతున్న హైదరాబాద్ టెక్కీ అరెస్ట్

ఇప్పటివరకు మునీర్ 200 మంది అమ్మాయిలను ఉద్యోగాల పేరుతో భారత్ తీసుకువచ్చాడని….నకిలీ ధృవపత్రాలు తయారు చేసేందుకు వారిలో 75 మందిని వివాహం చేసుకుని వారికి భారత పౌరసత్వం వచ్చేలా చేశాడని పోలీసులు తెలిపారు. అనంతరం వారందరినీ వేశ్యలుగా మార్చేవాడు. బంగ్లాదేశ్ నుంచి యువతులను భారత్ తీసుకువస్తున్న అక్రమ రవాణా ముఠాకు చెందిన 30 మందిని ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు.

అక్టోబర్ 2న  ఇద్దరు యువతులను వ్యభిచార కూపంలోని దించటానికి ముంబై నుండి ఇండోర్ తీసుకువచ్చినప్పుడు మునీర్ బాగోతం బయటపడింది. ఇండోర్‌లో ఈవెంట్ ఉందని చెప్పి హోటల్‌కు తీసుకు వచ్చి వారిని బలవంతంగా వ్యభిచారం చేయాలని హింసించారు. వారిలో ఒక యువతి పారిపోయి ఇండోర్ లోని విజయనగర్ పోలీసు స్టేషన్‌కు చేరుకుని ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు వెంటనే అలర్టై నిందితుడు మునీర్‌ను అరెస్ట్ చేశారు. అతడిని విచారించి మునీర్  చెరలో ఉన్న 11 మంది బంగ్లాదేశ్ యువతులను, దేశంలోని ఇతర ప్రాంతాలకు చెందిన 10 మంది యువతులను రక్షించారు. మునీర్ పై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.