Child Porn Videos : చైల్డ్ పోర్న్ వీడియోలు అమ్ముతున్న హైదరాబాద్ టెక్కీ అరెస్ట్

హైదరాబాద్‌కు   చెందిన సాఫ్ట్‌వేర్    ఇంజనీర్ చైల్డ్  పోర్న్ వీడియోలు అమ్ముతూ పోలీసులకు చిక్కాడు. చైల్డ్ పోర్న్ వీడియోలపై కేంద్రం నిషేధం విధించింది. అవి చూసినా, డౌన్లోడు చేసినా, ఫార

Child Porn Videos : చైల్డ్ పోర్న్ వీడియోలు అమ్ముతున్న హైదరాబాద్ టెక్కీ అరెస్ట్

Swe Sold Child Porn Videos

Child Porn Videos : తేలికగా డబ్బులు సంపాదించేసి  రాత్రికి రాత్రే ధనవంతులైపోవాలనే ఆశతో  పలువురు అడ్డదారులు తొక్కుతున్నారు. మొన్నీ మధ్య బెంగుళూరుకు చెందిన సాఫ్ట్‌వేర్   ఇంజనీర్ యువతి డ్రగ్స్ అమ్ముతూ పట్టుబడగా..నేడు హైదరాబాద్‌కు   చెందిన సాఫ్ట్‌వేర్    ఇంజనీర్ చైల్డ్  పోర్న్ వీడియోలు అమ్ముతూ పోలీసులకు చిక్కాడు. చైల్డ్ పోర్న్ వీడియోలపై కేంద్రం నిషేధం విధించింది. అవి చూసినా, డౌన్లోడు చేసినా, ఫార్వర్డ్ చేసినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటోంది.

కరీంనగర్ జిల్లా ఎల్ఎండీ కాలనీ   పోలీసు స్టేషన్ పరిధిలోని నుస్తుల్లాపూర్  గ్రామానికి చెందిన మధుకర్ రెడ్డి    హైదరాబాద్ మాదాపూర్ లోని ఓ కంపెనీలో  సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ గా ఉద్యోగం చేస్తున్నాడు. తేలికగా డబ్బులు సంపాదించేందుకు టెలిగ్రామ్   సోషల్ మీడియా యాప్‌లో  ఒక పోర్న్ గ్రూప్ స్టార్ట్ చేశాడు.  వివిధ టెలిగ్రామ్ గ్రూపుల  నుంచి వచ్చే చైల్డ్ పోర్న్ వీడియోలు డౌన్లోడు చేసేవాడు.

తన గ్రూపులో జాయిన్ కావాలంటే రూ.100 సభ్యత్వం కట్టాలని రూల్ పెట్టాడు. అలా తన గ్రూపులో జాయిన్ అయిన  వారికి చైల్డ్ పోర్న్ వీడియోలు పంపించటం మొదలు పెట్టాడు. ఈ  పేమెంట్ల కోసం థర్డ్ పార్టీ ద్వారా క్యూఆర్ కోడ్ పొందిన స్కాన్ అండ్ పేతో డబ్బులు తన ఎకౌంట్ లోని జమ అయ్యేలా చేసుకున్నాడు.  ఈవిషయాన్నిపోలీసులు పసిగట్టారు.

రాష్ట్రంలోని మహిళలు చిన్నారుల వేధింపుల నియంత్రణ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన భద్రతా విభాగం రూపొందించిన సాప్ట్ వేర్ ద్వారా ఎస్సై పి.హరీష్ సైబర్ పెట్రోలింగ్ చేస్తుండగా మధుకర్ రెడ్డివ్యవహారాన్ని గుర్తించారు. మధుకర్ రెడ్డిని ట్రాక్ చేసి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.