×
Ad

Karimnagar Incident: కరీంనగర్ స్కూల్ లో దారుణం.. అమ్మాయిల టాయిలెట్లలో కెమెరాలు పెట్టి లైంగిక వేధింపులు.. అటెండర్ అరెస్ట్

పూర్తి స్థాయిలో విచారణ జరిపి నిందితుడి వద్ద ఉన్న వీడియోలను స్వాధీనం చేసుకోవాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ పోలీసులను ఆదేశించారు.

Karimnagar Incident: అమ్మాయిలకు రక్షణ లేకుండా పోతోంది. ఇంట, బయట వారికి ఎక్కడా సేప్టీ లేకుండా పోతోంది. లైంగిక వేధింపులు ఆగడం లేదు. నిత్యం ఏదో ఒక చోట లైంగిక దాడులు, వేధింపులు చోటు చేసుకుంటున్నాయి. ఆడపిల్లల భద్రతపై వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అమ్మాయిల రక్షణ కోసం ప్రభుత్వం ఎన్ని చట్టాలు తెస్తున్నా వేధింపులు మాత్రం ఆగడం లేదు.

తాజాగా కరీంనగర్ గంగాధరలోని ఓ స్కూల్ లో దారుణం జరిగింది. అటెండర్ యాకుబ్ బాషా దారుణానికి ఒడిగట్టాడు. టాయిలెట్లలో కెమెరాలు పెట్టాడు. వాటి ద్వారా అమ్మాయిలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. అటెండర్ వేధింపులు శ్రుతి మంచిపోవడంతో భరించలేకపోయిన విద్యార్థులు తల్లిదండ్రులకు చెప్పుకుని భోరున విలపించారు.

ఈ దారుణం బయటకు రావడంతో బీజేపీ నేతలు భగ్గుమన్నారు. నిందితుడిపై చర్యలు తీసుకోవాలని ఆందోళన నిర్వహించారు. ఈ విషయం కేంద్ర మంత్రి బండి సంజయ్ కు తెలిసింది. ఆయన వెంటనే కరీంనగర్ రూరల్ ఏసీపీతో మాట్లాడారు. ఈ ఘటనకు సంబంధించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.

పూర్తి స్థాయిలో విచారణ జరిపి నిందితుడి వద్ద ఉన్న వీడియోలను స్వాధీనం చేసుకోవాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ పోలీసులను ఆదేశించారు. ఆందోళనలో ఉన్న విద్యార్థుల తల్లిదండ్రులకు పూర్తి భరోసా కల్పించేలా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.

Also Read: ముంచుకొస్తున్న ముప్పు.. రైలు ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. 97 రైళ్లు రద్దు..