అమెరికాలో కాల్పులు : 5గురు మృతి

  • Publish Date - January 24, 2019 / 02:29 AM IST

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం చెలరేగింది. దుండగుడి కాల్పుల్లో 5గురు పౌరులు మృతి చెందారు. ఫ్లోరిడా రాష్ట్రంలోని ఓ బ్యాంకులో దుండగుడు కాల్పులు జరిపాడు. సెబ్రింగ్‌ నగరంలోని  సన్‌ ట్రస్ట్‌ బ్యాంకులోకి వెళ్లిన దుండగుడు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డాడు. విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో స్పాట్‌లోనే ఐదుగురు మృతిచెందారు. దుండగుడిని సెబ్రింగ్‌కు చెందిన 21  ఏళ్ల జీపెన్‌ జావర్‌గా పోలీసులు గుర్తించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.