పాకిస్థాన్‌లోని ఫైసలాబాద్‌కు చెందిన పాపులర్ బాలీవుడ్ సింగర్ రాహత్ ఫతే అలీఖాన్ చిక్కుల్లో పడ్డాడు. విదేశీ కరెన్సీ అక్రమ రవాణా చేసిన కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అతనికి నోటీసులు జారీ చేసింది. ఇండియా నుంచి మూడేళ్లుగా అతడు విదేశీ కరెన్సీని అక్రమంగా రవాణా చేస్తున్నట్లు ఈడీ కేసు నమోదు చేసింది. రూ.2.61 కోట్ల విలువైన కరెన్సీకి సంబంధించి 45 రోజుల్లో వివరణ ఇవ్వాలని రాహత్‌ను అడిగింది. ఒకవేళ అతడు వివరణ ఇవ్వలేకపోతే 300 శాతం జరిమానా విధించనున్నారు..చెల్లించలేకపోతే భవిష్యత్తులో మళ్లీ ఇండియాలో ఎక్కడా ప్రదర్శన ఇచ్చే అవకాశం లేకుండా చేస్తారు.
2011లోనే డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్.. రాహత్, అతని మేనేజర్ మరూఫ్ అలీ ఖాన్‌లను ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో పట్టుకుని వాళ్ల దగ్గర ఉన్న 1.24 లక్షల డాలర్లను స్వాధీనం చేసుకుంది. (FEMA) చట్టం కింద ఇలాంటి కేసుల్లో విచారణ జరిపే ఈడీ.. ఈ కేసును తన పరిధిలోకి తీసుకుంది. అయితే రాహత్ మాత్రం తాను తప్పు చేయలేదని అంటున్నాడు.