Fire Accident Six Dead : యూపీలో ఘోర అగ్ని ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు సజీవదహనం

ఉత్తరప్రదేశ్ లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు సజీవదహనం అయ్యారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. మంగళవారం ఫిరోజాబాద్ జస్రావాలోని  ఎలక్ట్రానిక్ అండ్ ఫర్నీచర్ షాప్ లో పెద్ద త్తున మంటలు చెలరేగాయి. 

  • Updated on- November 30, 2022 / 07:05 AM IST

fire accident

Fire Accident Six Dead : ఉత్తరప్రదేశ్ లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు సజీవదహనం అయ్యారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. మంగళవారం అర్ధరాత్రి  ఫిరోజాబాద్ జస్రావాలోని  ఎలక్ట్రానిక్ అండ్ ఫర్నీచర్ షాప్ లో పెద్ద త్తున మంటలు చెలరేగాయి.  అగ్ని ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం జరిగినట్లు తెలిసింది. సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు.

అగ్నిమాపక సిబ్బంది ఫైరింజన్లతో మంటలను అదుపు చేశారు. కాగా అప్పటికే ఆరుగురు సజీవదహనం అయ్యారు. వీరిలో నలుగురు పిల్లలు ఉన్నారు. 18 ఫైరింజన్లతో మంటలను ఆర్పుతున్నట్లు ఫిరోజాబాద్ ఎస్పీ ఆశిష్ పేర్కొన్నారు. రద్దీ ప్రాంతం కావడంతో ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడినట్లు చెప్పారు. షాప్ లోపల ఇంకా ఎవరైనా చిక్కుకుపోయారా అనే దానిపై స్పష్టత లేదని తెలిపారు. సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు వెల్లడించారు.

Fire Accident In China: చైనాలోని ఓ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం.. 36 మంది సజీవదహనం

భవనం మొత్తం మంటలు వ్యాపించాయి. కుటుంబం కూడా అదే భవనంలో నివసిస్తుండటంతో ప్రాణ నష్టం జరిగింది. ఈ ఘటనపై సీఎం యోగి ఆదిత్యానాథ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా అందించాలని అధికారులను ఆదేశించారు.