Fire Accident In China: చైనాలోని ఓ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం.. 36 మంది సజీవదహనం

చైనాలో ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. హెనాన్ నగరంలో ఉన్న వర్క్‌షాప్‌లో అగ్నిప్రమాదం సంభవించడంతో 36 మంది మరణించగా, మరికొందరు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

Fire Accident In China: చైనాలోని ఓ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం.. 36 మంది సజీవదహనం

Fire Accident in china

Updated On : November 22, 2022 / 9:15 AM IST

Fire Accident In China: చైనాలో ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. హెనాన్ నగరంలో ఉన్న వర్క్‌షాప్‌లో అగ్నిప్రమాదం సంభవించడంతో 36 మంది మరణించగా, మరికొందరు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మీడియా నివేదికల ప్రకారం.. ఈ అగ్ని ప్రమాదం సోమవారం సాయంత్రం 4గంటల సమయంలో చోటు చేసుకుంది. 36 మంది మరణించగా.. ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మరో ఇద్దరి ఆచూకీ లభ్యంకాలేదని స్థానిక అధికారులు తెలిపారు.

Shamshabad Airport Fire Accident : శంషాబాద్ ఎయిర్ పోర్టులో అగ్నిప్రమాదం, భయాందోళన చెందిన ప్రయాణికులు

ప్రమాదం జరిగిన వెంటనే భారీగా మంటలు ఎగిసిపడటంతో మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. 200 మందికి పైగా సెర్చ్ రెస్క్యూ వర్కర్లు, 60 మంది అగ్నిమాపక సిబ్బంది శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అగ్నిప్రమాదానికి కారకులుగా భావిస్తున్న అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు స్థానిక పోలీసులు తెలిపారు. అయితే, ప్రమాదానికి కారణాలపై పూర్తిస్థాయిలో స్పష్టత రాలేదు.

China Restaurant Fire: చైనాలోని ఓ రెస్టారెంట్‌లో భారీ అగ్నిప్రమాదం.. 17మంది మృతి

చైనాలో గతంలోనూ ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. 2019 మార్చినెలలో షాంఘైకి 260 కిమీ దూరంలోని యాంచెంగ్‌లోని ఒక రసాయన కర్మాగారం పేలింది. ఈ ఘటనలో 78 మంది మరణించారు. 2015లో ఉత్తర టియాంజిన్‌లోని ఒక రసాయన గోదాములో జరిగిన భారీ పేలుడులో 165 మంది మరణించారు.