Shamshabad Airport Fire Accident : శంషాబాద్ ఎయిర్ పోర్టులో అగ్నిప్రమాదం, భయాందోళన చెందిన ప్రయాణికులు

రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ఎయిర్ పోర్టులో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఎయిర్ పోర్టు పార్కింగ్ ఏరియాలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పార్కింగ్ చేసి ఉంచిన ఓ ఎలక్ట్రిక్ వాహనం నుంచి మంటలు చెలరేగాయి.

Shamshabad Airport Fire Accident : శంషాబాద్ ఎయిర్ పోర్టులో అగ్నిప్రమాదం, భయాందోళన చెందిన ప్రయాణికులు

Updated On : November 19, 2022 / 11:14 PM IST

Shamshabad Airport Fire Accident : రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ఎయిర్ పోర్టులో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఎయిర్ పోర్టు పార్కింగ్ ఏరియాలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పార్కింగ్ చేసి ఉంచిన ఓ ఎలక్ట్రిక్ వాహనం నుంచి మంటలు చెలరేగాయి. వెంటనే అలర్ట్ అయిన విమానాశ్రయం అధికారులు ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

స్పాట్ కి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేశారు. ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణం అని తెలుస్తోంది. కాగా, ఎయిర్ పోర్టులో అగ్నిప్రమాదం జరగడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ఏం జరుగుతుంతో అర్థం కాక కంగారుపడ్డారు.