Birth Day Party : బర్త్‌డే పార్టీలో అపశృతి-చెరువులో పడి యువకుడు మృతి
మిత్రుడి పుట్టిన రోజు సందర్భంగా ఆనందంలో ఉన్న యువకుడు చెరువులో స్నానానికి దిగి మృత్యువాత పడ్డాడు.
- chvmurthy
- Published On : December 6, 2021 / 09:09 AM IST
student died in birthday party
Birth Day Party : కృష్ణాజిల్లా జి.కొండూరు మండలం చెరువు మాధవరం గ్రామంలో బర్త్‌డే పార్టీలో విషాదం చోటు చేసుకుంది. మిత్రుడి పుట్టిన రోజు సందర్భంగా ఆనందంలో ఉన్న యువకుడు చెరువులో స్నానానికి దిగి మృత్యువాత పడ్డాడు. మైలవరంలో ప్రైవేట్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులు 15 మంది నిన్న చెరువు మాధవరం గ్రామంలో ఉన్న కొండ ప్రాంతానికి వెళ్లారు. అక్కడ ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళు మద్యం తీసుకున్నారు.
సెల్‌ఫోన్ ద్వారా సెల్ఫీలు తీసుకున్నారు. ఇంతలో అక్కడే ఉన్న ఒక చెరువు దగ్గర భూక్య రామునాయక్ (17) అనే విద్యార్థి స్నానానికి చెరువులో దిగాడు. అప్పటికే మద్యం సేవించి ఉండటం వల్ల రాము నాయక్ ఈత కొట్టలేక నీటిలో మునిగి మృతి చెందాడు. దీంతో అప్పటి దాకా ఆనందోత్సాహాల్లో ఉన్న ఆ ప్రాంతమంతా ఒక్కసారిగా విషాదం అలుముకుంది.
Also Read : Cyber Crime : మిత్రుడి ఫోటోతో వాట్సప్ చాటింగ్-రూ.30 వేలు కాజేసిన సైబర్ నేరస్థుడు
సమాచారం తెలుసుకుని ఘటనా స్ధలానికి వచ్చిన యువకుని తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఇబ్రహీంపట్నం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
