Cyber Crime : మిత్రుడి ఫోటోతో వాట్సప్ చాటింగ్-రూ.30 వేలు కాజేసిన సైబర్ నేరస్థుడు

వాట్సప్ లో తమ స్నేహితుడి ఫోటో పెట్టి కొద్ది నిమిషాల్లోనే 5 మంది నుంచి రూ. 30 వేలు కాజేసి ఫోన్ స్విచ్చాఫ్ చేసుకున్నాడు సైబర్ నేరస్తుడు. ఇంతకు ముందు నకిలీ ఫేస్ బుక్ ఖాతాలు తెరిచి డబ్

Cyber Crime : మిత్రుడి ఫోటోతో వాట్సప్ చాటింగ్-రూ.30 వేలు కాజేసిన సైబర్ నేరస్థుడు

Cyber Crime

Cyber Crime :  సైబర్ నేరగాళ్లు కొత్త అవతారాలెత్తుతున్నారు. ఏదో ఒక టెక్నిక్ ఉపయోగించి అమాయక ప్రజల నుంచి డబ్బులు కాజేస్తూనే  ఉన్నారు. వాట్సప్ లో తమ స్నేహితుడి ఫోటో పెట్టి కొద్ది నిమిషాల్లోనే 5 మంది నుంచి రూ. 30 వేలు కాజేసి ఫోన్ స్విచ్చాఫ్ చేసుకున్నాడు సైబర్ నేరస్తుడు. ఇంతకు ముందు నకిలీ ఫేస్ బుక్ ఖాతాలు తెరిచి డబ్బులు అడిగిన నేరస్తులు ఇప్పుడు వాట్సప్ ను ఉపయోగిస్తున్నారు.

సిధ్దిపేట జిల్లా వర్గల్ మండలంలోని ఒక యువకుడు ఉన్నత చదువులు చదువుకుని అమెరికాలో స్ధిర పడ్డాడు. దీన్ని ఆసరాగా చేసుకున్న ఓ మోసగాడు అమెరికాలోని యువకుడి ఫోటో పెట్టుకున్న వాట్సప్ నెంబర్ నుంచి ” హాయ్….నా మిత్రుడు ఒకతను ఆపదలో ఉన్నాడు. అర్జంట్ గా 5 వేలు పంపించవా” అంటూ ఓ ఫోన్ నెంబర్ పై మెసేజ్ పంపించాడు.

Also Read : Real Estate Cheaters : రియల్ ఎస్టేట్ పేరుతో మోసాలు-ఇద్దరు నిందితులు అరెస్టు

మెసేజ్ పంపించినది నిజంగానే తన మిత్రుడు అనుకుని ఆ మెసేజ్ వచ్చినవారు  రూ.4, రూ.5 వేలు చొప్పున సైబర్ నేరస్తుడు ఇచ్చిన నెంబరుకు డబ్బులు పంపించారు. అనంతరం ఆ మెసేజ్ వచ్చిన నెంబరుకు ఫోన్ చేసి ఎలా ఉంది అని ఆరా తీయబోగా ఆ నెంబర్  స్విఛ్చాఫ్ వచ్చింది.  వారిలొ కొందరు నెంబర్ చెక్ చేసుకుని   ఒరిజినల్ గా అమెరికాలో ఉన్న స్నేహితుడికి ఫోన్ చేసి అడగ్గా నేనేమి డబ్బులు అడగలేదే అని సమాధానం చెప్పాడు. దీంతో డబ్బులు పంపించిన వారంతా మోసపోయామని గ్రహించారు.

సోషల్ మీడియా ప్లాట్ ఫాం లైన ఫేస్ బుక్ , ఇన్‌స్టా‌గ్రాం ద్వారా ఫోటోలు సేకరించి సైబర్ నేరస్తులు ఈ తరహా మోసాలు చేస్తున్నారు. ఎవరి వద్దనుంచైనా డబ్బులు కావాలని మెసేజ్ వస్తే ముందుగా ఆ వ్యక్తికి ఫోన్ చేసి విచారించుకుని డబ్బులు పంపించాలని పోలీసలు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇదివరకటి దాకా పట్టణాలకే పరిమితమైన సైబర్ నేరాలు ఇప్పుడు గ్రామాలకు కూడా వ్యాపించటం కలకలం రేపుతోంది.