Andhra Pradesh : పల్నాడులో ఫ్యాక్షన్ హత్య-ప్రత్యర్ధుల దాడిలో టీడీపీ కార్యకర్త మృతి
పల్నాడులో మరో సారి ఫ్యాక్షన్ భూతం పురి విప్పింది. ప్రత్యర్ధుల దాడిలో టీడీపీ కార్యకర్త హత్యకు గురయ్యాడు.
- chvmurthy
- Published On : June 3, 2022 / 06:18 PM IST
palnadu murder
Andhra Pradesh : పల్నాడులో మరో సారి ఫ్యాక్షన్ భూతం పురి విప్పింది. ప్రత్యర్ధుల దాడిలో టీడీపీ కార్యకర్త హత్యకు గురయ్యాడు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దుర్గి మండలం జంగమేశ్వరపాడుకు చెందిన టీడీపీ కార్యకర్త కంచర్ల జల్లయ్య ఆ గ్రామాన్ని విడిచిపెట్టి గత మూడేళ్లుగా మాడుగుల గ్రామంలో ఉంటున్నాడు.
ఈరోజు దుర్గిలోని బ్యాంకు కు వెళ్ళటానికి నిన్న రాత్రి గ్రామానికి చేరుకున్నాడు. దుర్గి బ్యాంకు కు వెళుతుండగా దారి కాచి ప్రత్యర్ధులు వేట కొడవళ్ళు, కర్రలతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన జల్లయ్యను మొదట మాచర్ల ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ జల్లయ్య మరణించాడు. ఈఘటనలో ఎల్లయ్య, బక్కయ్య అనే మరో ఇద్దరికీ గాయాలయ్యాయి. పాత కక్షలే దాడికి కారణమని పోలీసులు తెలిపారు. గ్రామంలో ఎటువంటి ఘర్షణలు తలెత్తకుండా పోలీసులను మొహరించారు.
Also Read : Jubilihills Rape Case: బాలికపై అత్యాచార ఘటన.. పోలీసులపై రఘనందన్‌రావు ఫైర్
