×
Ad

TDP Woman Leader Suicide Attempt : పోలీసుల వేధింపులు భరించలేక టీడీపీ నాయకురాలు ఆత్మహత్యాయత్నం

పోలీసుల వేధింపులు భరించలేక అనంతపురం జిల్లా టీడీపీ మహిళా కార్యదర్శి వాల్మీకి ప్రియాంక ఆత్మహత్యాయత్నం చేశారు. 

  • Published On : November 26, 2021 / 01:08 PM IST

Atp Tdp Leader Suicide Attempt

TDP Woman Leader Suicide Attempt :  పోలీసుల వేధింపులు భరించలేక అనంతపురం జిల్లా టీడీపీ మహిళా కార్యదర్శి వాల్మీకి ప్రియాంక ఆత్మహత్యాయత్నం చేశారు.  ఇటీవల ఏపీ అసెంబ్లీలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరిపై జరిగిన అనుచిత వ్యాఖ్యలను  ఓ మీడియా సమావేశంలో ప్రియాంక ఖండించారు.

ఆ సందర్భంగా వైసీపీ నేతలు ప్రియాంకతో   సహా మరో నలుగురిపై   అనంతపురం 4టౌన్ పోలీసు స్టేషన్‌లో  కేసు పెట్టారు. కేసు  విచారణలో భాగంగా   గురువారం ఉదయం పోలీసులు ఆమె ఇంటిలోకి   ప్రవేశించి సోదాలు చేపట్టారు.  సాయంత్ర దాకా కొనసాగిన సోదాల సమయంలో పోలీసులు చాలా అనుచితంగా ప్రవర్తించటమే కాక బెదిరించారని ఆమె భర్త శ్రీధర్ ఆరోపించారు.

Also Read : Married Woman Suicide : హైదరాబాద్‌లో వివాహిత ఆత్మహత్య

ఏపీ అసెంబ్లీ సంఘటనను ఖండించిన తర్వాత నుంచి బెదిరింపు  ఫోన్ కాల్స్ వచ్చాయని…. కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు రాత్రిపూట ఇంటి వద్దకు వచ్చి బెదిరించారని ఆయన చెప్పారు.  పోలీసుల వేధింపులు తాళలేక ప్రియాంక నిన్న  రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది.  దీంతో ఆమెను అనంతపురంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.