×
Ad

Head Master raped girl : మాస్కు పెట్టుకోలేదని పిలిచి..విద్యార్ధినిపై హెడ్మాస్టర్ అత్యాచారం

మాస్కు పెట్టుకోలేదని పిలిచి 9th calss విద్యార్ధినిపై హెడ్మాస్టర్ అత్యాచారానికి పాల్పడిన ఘటన హైదరాబాద్ శివారులోని శామిర్‌పేటలో స్కూల్లో చోటుచేసుకుంది.

  • Published On : December 30, 2021 / 11:15 AM IST

Head Master Raped 9th Class Girl

Head Master raped 9th class girl : మాస్కు పెట్టుకోలేదని పిలిచి విద్యార్ధినిపై హెడ్మాస్టర్ అత్యాచారానికి పాల్పడిన దారుణం హైదరాబాద్ నగర శివారులో చోటుచేసుకుంది. ఉపాధ్యాయుడు అంటే సమాజం గురించి ఎంతో బాధ్యతగా పిల్లలకు చెప్పాల్సినవాడు అత్యాచారానికి తెగబడ్డాడు. కన్నబిడ్డలా చూసుకోవాల్సిన బాలికపై పశువులా లైంగిక దాడికి పాల్పడ్డాడు.ఈ విషయం బయట ఎవరికన్నా చెబితే చంపేస్తానని..బెదిరించాడు.

హైదరాబాద్ శివారులోని శామిర్‌పేటలో 9వ క్లాస్ చదువుతున్న విద్యార్ధినిపై స్కూలు హెడ్మాస్టారు అత్యాచారానికి పాల్పడ్డాడు. డిసెంబర్ 22న జరిగిన ఈ దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని శామిర్‌పేటకు చెందిన ఓ విద్యార్థిని తొమ్మిదో తరగతి చదువుతోంది. డిసెంబర్ 22న స్కూలుకు వెళ్లిన బాలిక మాస్కు పెట్టుకోలేదు. దీంతో హెడ్మాస్టారు నా రూమ్ కు రా అంటూ నీ సంగతి చెబుతా అంటూ పిలిచాడు. భయపడుతు వెళ్లిని ఆ విద్యార్థినిపై ఆగ్రహం వ్యక్తం చేస్తు దుర్భాషలాడాడు. దీనికి పనిష్మెంట్ ఏంటో తెలుసా? అంటూ ఆ విద్యార్థినిపై బాలికపై అత్యాచారానికి తెగబడ్డాడు.

ఈ విషయం ఎవరికైనా చెబితే నీ అంతు చూస్తానంటూ బెదిరించాడు. దీంతో పాపం ఆ బాలిక మౌనంగా ఉండిపోయింది. కానీ ఓ సందర్భంలో ఈ విషయం బయటపడింది. గతంలో అదే స్కూల్లో పనిచేసిన మహిళా హెడ్మాస్టారు స్కూల్ కు రావటంతో పాపం ఆ బాలిక తనలో దాచుకున్న బాధను ఆమె ముందు వెళ్లగ్రక్కింది.

బాలిక బాధ విన్న ఆమె బాలికకు నేనున్నాను అంటూ ధైర్యం చెప్పింది. దీంతో బాధితురాలు తల్లితో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేయటంతో ఈ విషయం బయటపడింది. బాలిక ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు హెడ్మాస్టర్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.