హత్య, ఆత్మహత్య : ప్రియురాలి ఇంట్లో ప్రియుడు మృతి

  • Publish Date - May 5, 2019 / 01:21 PM IST

చిత్తూరు జిల్లా కురబల కోట మండలం కమటం పల్లెలో విషాదం చోటు చేసుకుంది. ప్రియురాలి ఇంట్లో ప్రియుడు శశికుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు. శశికుమార్, ఐశ్వర్య రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో ఐశ్వర్య ఇంటికి వెళ్లిన శశికుమార్.. శవమై కనిపించాడు. తమ కుమారుడిని అమ్మాయి తల్లిదండ్రులే చంపారని అబ్బాయి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

ఆదివారం (మే 5,2019) మధ్యాహ్నం శశికుమార్.. ఐశ్వర్య ఇంటికి వెళ్లాడు. ఏం జరిగిందో తెలియదు కానీ ఓ కొక్కీకి వేలాడుతూ కనిపించాడు. విషయం తెలుసుకున్న శశి తల్లిదండ్రులు ఐశ్వర్య ఇంటికి వెళ్లారు. అక్కడ ఆందోళనకు దిగారు. అమ్మాయి తల్లిదండ్రులు.. తమ అబ్బాయిని ఇంటికి పిలిపించుకుని చంపేశారని వారు ఆరోపిస్తున్నారు. చంపేసి.. ఆత్మహత్య చేసుకున్నట్టు చిత్రీకరించే ప్రయత్నం జరుగుతోందన్నారు. అబ్బాయి తల్లిదండ్రులు ఆందోళనకు దిగడంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రంగంలోకి దిగిన పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు ప్రారంభించారు. ఇరు కుటుంబాల వారిని విచారిస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక వచ్చాక… ఇది హత్య, ఆత్మహత్య అనేది తెలుస్తుందని పోలీసులు చెప్పారు.