×
Ad

Teachers Molestation : ప్రభుత్వ పాఠశాలలో దారుణం.. 5వ తరగతి విద్యార్థినిపై టీచర్ల లైంగిక దాడి, టాయ్‌లెట్‌కి లాక్కెళ్లి

Two Teachers Detained For Molestation : ఈ తరహా దారుణాలు తల్లిదండ్రులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. తమ పిల్లల భద్రత విషయం వారికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది.

  • Published On : November 10, 2023 / 06:50 PM IST

Two Teachers Detained For Molestation (Photo : Google)

పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పి వారు సన్మార్గంలో వెళ్లేలా చూడాల్సిన టీచర్లు దారి తప్పుతున్నారు. కామంతో కళ్లు మూసుకుపోయి పిల్లలపై అఘాయిత్యాలకు ఒడిగడుతున్నారు. అభంశుభం తెలియని పసి పిల్లలను కూడా వదిలిపెట్టడం లేదు ఈ కామాంధులు. దేశంలో నిత్యం ఏదో ఒక ప్రాంతంలో విద్యార్థినులపై టీచర్ల లైంగిక దాడి ఘటనలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. ఈ తరహా దారుణాలు తల్లిదండ్రులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. తమ పిల్లల భద్రత విషయం వారికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది.

ప్రైవేట్ పార్ట్స్ చూపిస్తూ అత్యాచారయత్నం..
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మధురలో ఓ స్కూల్ టీచర్ క్లాస్ రూమ్ లోనే తన ప్రైవేట్ పార్ట్స్ చూపిస్తూ విద్యార్థినిపై అత్యాచారయత్నం చేయడం తీవ్ర కలకలం రేపింది. ఈ దారుణం మరువక ముందే మరో స్కూల్ లో మరో ఘోరం వెలుగుచూసింది. స్కూల్ ఆవరణలోనే ఇద్దరు టీచర్లు 5వ తరగతి విద్యార్థినిపై లైంగిక దాడి చేశారు.

Also Read : బరితెగించిన స్కూల్ టీచర్.. ప్రైవేట్ పార్ట్స్ చూపిస్తూ విద్యార్థినిపై అత్యాచారయత్నం.. వీడియో వైరల్

బలవంతంగా టాయ్ లెట్ లోకి తీసుకెళ్లి..
ఒడిశా రాష్ట్రం నబరంగ్ పూర్ జిల్లా రాయ్ ఘర్ బ్లాక్ లోని ప్రభుత్వ పాఠశాలో ఈ ఘోరం జరిగింది. ఇద్దరు టీచర్లు కామంధుల్లా మారారు. 5వ తరగతి చదువుతున్న 11ఏళ్ల విద్యార్థినిపై అత్యాచారం చేశారు. బాలికను బలవంతంగా స్కూల్ టాయ్ లెట్ లోకి లాక్కెళ్లి మరీ దారుణానికి ఒడిగట్టారు. బాలికకు తీవ్రమైన నొప్పి రావడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. ఏం జరిగిందోనని తల్లిదండ్రులు ఆరా తీయగా బాలిక చెప్పింది విని వారు షాక్ కి గురయ్యారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాఫ్తు చేపట్టారు.

పోలీసులు బాలికను కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కు తరలించి చికిత్స అందించారు. బాలికపై లైంగిక దాడి జరిగినట్లు డాక్టర్ నిర్ధారించారు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు ఆ ఇద్దరు కీచకులను అరెస్ట్ చేశారు. ఈ అమానుషానికి ఒడిగట్టిన ఇద్దరు టీచర్లలో ఒకడు స్కూల్ హెడ్ మాస్టర్ కావడం మరింత షాక్ కి గురి చేసే అంశం.

Also Read : షాకింగ్.. అడల్ట్ వీడియో చేస్తూ అడ్డంగా దొరికిపోయిన ముగ్గురు యాక్టర్లు