×
Ad

Pakistan spy agent : యూపీలో పాకిస్థానీ గూఢచారి అరెస్ట్

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో పాకిస్థాన్ గూఢచారిగా పనిచేస్తున్న ఓ యువకుడిని ఉత్తరప్రదేశ్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ అరెస్టు చేసింది. హుసేన్ అనే పాక్ గూఢచారికి రయీస్ భారత సైనిక కంటోన్మెంట్ల గురించి రహస్య సమాచారాన్ని పంపించాడు....

  • Published On : July 17, 2023 / 04:53 AM IST

Pakistan spy agent arrest

Pakistan spy agent : ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో పాకిస్థాన్ గూఢచారిగా పనిచేస్తున్న ఓ యువకుడిని ఉత్తరప్రదేశ్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ అరెస్టు చేసింది. (Pakistan’s spy agency ISI arrested) యూపీలోని (Uttar Pradesh man) గోండా జిల్లా తారాబ్ గంజ్ ప్రాంతానికి చెందిన మహ్మద్ రయీస్ కొంత కాలం ముంబయిలో పనిచేశాడు. ఆ సమయంలో రయీస్ కు అర్మాన్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది.

Delhi Floods: అస్సాం వరదలకు చైనా, భూటాన్ దేశాలే కారణం.. కేజ్రీవాల్ మీద సెటైర్లు వేసిన అస్సాం సీఎం

భారతదేశానికి వ్యతిరేకంగా గూఢచర్యం చేయమని అర్మాన్ రయీస్ తో ఒప్పించాడు. 2022వ సంవత్సరంలో రయీస్ కు విదేశీ నంబరు నుంచి ఫోన్ కాల్ వచ్చిందని యూపీ ఏటీఎస్ అధికారులు చెప్పారు. హుసేన్ అనే పాక్ గూఢచారికి రయీస్ భారత సైనిక కంటోన్మెంట్ల గురించి రహస్య సమాచారాన్ని పంపించాడు. దీనికి ప్రతిఫలంగా పాక్ నుంచి 15వేల రూపాయలు పొందాడు.

Sonia Gandhi dance: డ్యాన్స్ చేసిన సోనియా గాంధీ.. వీడియో వైరల్

రయీస్ కార్యకలాపాలు అనుమానాస్పదంగా ఉండటంతో అతన్ని లక్నోలోని ఏటీఎస్ ప్రధాన కార్యాలయానికి పిలిచి ప్రశ్నించారు. ఏటీఎస్ విచారణలో తాను గూఢచర్యానికి పాల్పడ్డానని రయీస్ అంగీకరించడంతో అతన్ని అరెస్ట్ చేశామని ఏటీఎస్ స్పెషల్ డీజీ ప్రశాంత్ కుమార్ చెప్పారు. రయీస్ పై ఐపీసీ 121 ఎ, 123, అధికారుల రహస్యాల చట్టాల ప్రకారం కేసు నమోదు చేశామని ఏటీఎస్ అధికారులు చెప్పారు.