Delhi Floods: అస్సాం వరదలకు చైనా, భూటాన్ దేశాలే కారణం.. కేజ్రీవాల్ మీద సెటైర్లు వేసిన అస్సాం సీఎం

ఇతరులను ఎప్పుడూ నిందించలేదు. ఎందుకంటే ప్రకృతి అలా చేయదని మనకు తెలుసు. దానికి కారణం భౌగోళిక పరిస్థితులు. వాటిని గుర్తించండి అని హిమంత బిశ్వా శర్మ ఆదివారం ట్వీట్ చేశారు.

Delhi Floods: అస్సాం వరదలకు చైనా, భూటాన్ దేశాలే కారణం.. కేజ్రీవాల్ మీద సెటైర్లు వేసిన అస్సాం సీఎం

Assam Floods: ఢిల్లీలో వరదలకు భారతీయ జనతా పార్టీ కుట్ర చేసిందని, హర్యానాలోని హత్నికుండ్ బ్యారేజీ నుంచి దేశ రాజధానికి అదనపు నీటిని విడుదల చేయడమే కారణమంటూ ఆమ్ ఆద్మీ పార్టీ చేసిన విమర్శలపై బీజేపీ ఘాటుగా స్పందించింది. అస్సాంలో వరదలు వస్తున్న సందర్భాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వా శర్మ ఉదహరిస్తూ.. ఆ వరదలకు కారణం చైనా, భూటాన్ దేశాలేనని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‭ను ఎద్దేవా చేశారు. ప్రతి సంవత్సరం భూటాన్, అరుణాచల్ ప్రదేశ్, చైనాల నుంచి పెద్ద ఎత్తున అస్సాంకు వరద వస్తుందని, అయినప్పటికీ అస్సామీలు ధైర్యంగా ఎదుర్కొంటుందని ఆయన ఒక ట్వీట్‌ ద్వారా తెలిపారు.

2024 Elections: 30 వర్సెస్ 24.. బీజేపీ, కాంగ్రెస్ కూటముల్లో ఏయే పార్టీలు ఉన్నాయో తెలుసా?

‘‘భూటాన్‌, అరుణాచల్‌, చైనా నుంచి ప్రతి సంవత్సరం పెద్ద ఎత్తున వరద అస్సాంకు వస్తుంది. మేం వాటిని ధైర్యంతో ఎదుర్కొంటాం. మానవుల ఊహకు అందని బాధను, బాధలను అనుభవిస్తాం. అయినా ఇతరులను ఎప్పుడూ నిందించలేదు. ఎందుకంటే ప్రకృతి అలా చేయదని మనకు తెలుసు. దానికి కారణం భౌగోళిక పరిస్థితులు. వాటిని గుర్తించండి” అని హిమంత బిశ్వా శర్మ ఆదివారం ట్వీట్ చేశారు.

Japan: 2,761 ఎమర్జెన్సీ కాల్స్ చేసిన మహిళ.. అసలు ఎందుకు అన్ని కాల్స్ చేసిందో తెలిస్తే షాక్ అవుతారు

ఇక ఢిల్లీ వరదలపై బీజేపీని ఉద్దేశించి ఆప్ విమర్శలు గుప్పించింది. ఢిల్లీ నీటిపారుదల, వరద నియంత్రణ మంత్రి సౌరభ్ భరద్వాజ్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. వరద పరిస్థితి నగరాన్ని ముంచేసే కుట్రని అన్నారు. “ఢిల్లీని ఉద్దేశపూర్వకంగా ముంచుతున్నారు. హత్నికుండ్ బ్యారేజీ నుంచి అదనపు నీటిని ఢిల్లీ వైపుకు మళ్లించారు. సుప్రీంకోర్టుతో సహా ఢిల్లీలోని అన్ని ముఖ్యమైన సంస్థలను ముంచడానికి కుట్ర జరిగింది” అని ఆయన అన్నారు. బ్యారేజీ నుంచి అదనపు నీటిని హర్యానాలోని పశ్చిమ కాలువకు, ఉత్తరప్రదేశ్‌లోని తూర్పు కాలువకు విడుదల చేయడం లేదని ఆయన పేర్కొన్నారు.