Japan: 2,761 ఎమర్జెన్సీ కాల్స్ చేసిన మహిళ.. అసలు ఎందుకు అన్ని కాల్స్ చేసిందో తెలిస్తే షాక్ అవుతారు

ఇలాంటి ఘటన జపాన్ లో మరొకటి జరిగింది. 2013లో 44 ఏళ్ల మహిళ ఆరు నెలల వ్యవధిలో 15,000 కంటే ఎక్కువ సార్లు పోలీసులకు కాల్ చేసినందుకు అరెస్టు అయింది. ఆమెను అరెస్టు చేయడానికి ముందు అధికారులు దాదాపు 60 సార్లు ఆమె ఇంటికి వెళ్లారు.

Japan: 2,761 ఎమర్జెన్సీ కాల్స్ చేసిన మహిళ.. అసలు ఎందుకు అన్ని కాల్స్ చేసిందో తెలిస్తే షాక్ అవుతారు

Loneliness: దాదాపు మూడేళ్ల వ్యవధిలో 2,761 తప్పుడు ఎమర్జెన్సీ కాల్స్ చేసిన మహిళను (51 ఏళ్లు) జపాన్‌లో అరెస్ట్ చేశారు. రాజధాని టోక్యోకు తూర్పున ఉన్న జపాన్‌లోని చిబా ప్రిఫెక్చర్‌లోని మాట్సుడోకు చెందిన హిరోకో హటగామి అనే నిరుద్యోగ మహిళను మొదట స్థానిక అగ్నిమాపక విభాగం కార్యకలాపాలను అడ్డుకున్నారనే అనుమానంతో గురువారం అరెస్టు చేశారు. గత రెండు సంవత్సరాల తొమ్మిది నెలలుగా మహిళ తన మొబైల్ ఫోన్, ఇతర మార్గాల నుంచి పదేపదే అత్యవసర కాల్స్ చేసిందని చిబా ప్రిఫెక్చురల్ పోలీసులు తర్వాత పసిగట్టారు.

Harish Rao Thanneeru : చంద్రబాబు అసలైన వారసుడు రేవంత్ రెడ్డి, ప్రజలు కళ్లకు అద్దుకుని మరీ ఆయనను గెలిపిస్తారు- మంత్రి హరీశ్ రావు

ఇంతకీ ఇన్ని కాల్స్ చేయడానికి కారణం ఏంటంటే.. ఒంటరితనమట. అవును.. ఎవరితోనైనా మాట్లాడాలని, తన మాటల్ని ఎవరికైనా చెప్పాలని ఆమె ఈ కాల్స్ చేశారట. ఆగస్ట్ 2020 నుంచి మే 2023 మధ్య కడుపు నొప్పి, మాదకద్రవ్యాల అధిక మోతాదు, ఇతర లక్షణాలతో పాటు కాళ్లు నొప్పులు ఉన్నాయని ఫిర్యాదు చేస్తూ, అంబులెన్స్‌లను పంపమని మాట్సుడో అగ్నిమాపక శాఖకు ఆమె పదేపదే కాల్స్ చేసింది.

Opposition Meet: కాంగ్రెస్ చేసిన ఆ ప్రకటనతో వెనక్కి తగ్గిన ఆప్.. అందుకు ఓకే అంటూ ప్రకటన

అయితే అంబులెన్స్‌ వచ్చినప్పుడు, ఆసుపత్రికి తీసుకెళ్లడానికి నిరాకరించింది. అసలు తాను ఎవరికీ కాల్ చేయలేదని చెప్పి తప్పించుకుంది. అగ్నిమాపక శాఖ, పోలీసుల నుంచి అనేక హెచ్చరికలు వచ్చినప్పటికీ, మహిళ అత్యవసర కాల్స్ చేస్తూనే ఉంది. చివరికి అగ్నిమాపక శాఖ జూన్ 20 న పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో అది ఆమె అరెస్టుకు దారి తీసింది. ఇలాంటి ఘటన జపాన్ లో మరొకటి జరిగింది. 2013లో 44 ఏళ్ల మహిళ ఆరు నెలల వ్యవధిలో 15,000 కంటే ఎక్కువ సార్లు పోలీసులకు కాల్ చేసినందుకు అరెస్టు అయింది. ఆమెను అరెస్టు చేయడానికి ముందు అధికారులు దాదాపు 60 సార్లు ఆమె ఇంటికి వెళ్లారు.

2024 Elections: 30 వర్సెస్ 24.. బీజేపీ, కాంగ్రెస్ కూటముల్లో ఏయే పార్టీలు ఉన్నాయో తెలుసా?

ఇక కొన్ని లెక్కల ప్రకారం.. జపాన్‌లో ఒంటరితనం అనుభవిస్తున్న వారి సంఖ్య దాదాపు 15 లక్షలు ఉన్నారట. కోవిడ్ మహమ్మారి వల్ల ఈ పరిస్థితి మరింత తీవ్రమైందని చెప్పారు. నవంబర్‌లో జపాన్ పిల్లలు, కుటుంబాల ఏజెన్సీ నిర్వహించిన ఒక సర్వేలో 15 నుంచి 64 సంవత్సరాల మధ్య వయస్సు గల ప్రతివాదులలో దాదాపు 2 శాతం మంది హికికోమోరిగా(ఈ పదం సామాజిక సంబంధాల నుంచి దూరమైన వ్యక్తులను సూచిస్తుంది) గుర్తించారు.

Nara Lokesh : జాగ్రత్త.. మీ వ్యక్తిగత వివరాలిస్తే ఆస్తులు కొట్టేస్తారు, వారందరికీ వడ్డీతో సహా చెల్లిస్తాం- నారా లోకేశ్

ఫిబ్రవరి 2021లో పెరిగిన ఒంటరితనం కారణంగా సాంఘిక ఒంటరితనంపై టెట్సుషి సకామోటోను ఒంటరితనం మంత్రిగా జపాన్ నియమించుకుంది. “పురుషుల కంటే మహిళలు ఎక్కువగా ఒంటరితనంతో బాధపడుతున్నారు. ఇది ఆత్మహత్యల పెరుగుదలకు కారణం అవుతోంది” అని ఒక సందర్బంలో ప్రధాన మంత్రి యోషిహిడే సుగా అన్నారు. జపాన్ టైమ్స్ ప్రకారం “మీరు సమస్యలను గుర్తించి, విధాన చర్యలను సమగ్రంగా ప్రోత్సహిస్తారని నేను ఆశిస్తున్నాను” అని ఆయన అన్నారు.