2024 Elections: 30 వర్సెస్ 24.. బీజేపీ, కాంగ్రెస్ కూటముల్లో ఏయే పార్టీలు ఉన్నాయో తెలుసా?

ఇటు విపక్షాల్ని ఏకం చేసే పనిలో కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతుంటే.. అటు ఎన్డీయే పక్షాలను ఏకం చేసే పనిలో భారతీయ జనతా పార్టీ సమాయత్తం అవుతోంది. ఎన్డీయే పక్షాల సమావేశం దేశ రాజధాని ఢిల్లీలో మంగళవారం (జూలై 18)న జరగనుంది

2024 Elections: 30 వర్సెస్ 24.. బీజేపీ, కాంగ్రెస్ కూటముల్లో ఏయే పార్టీలు ఉన్నాయో తెలుసా?

NDA vs UPA: 2024 సార్వత్రిక ఎన్నికలకు దేశంలో ఇరు పక్షాలు అస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి. గత నెల 23న బిహార్ రాష్ట్ర రాజధాని పాట్నాలో ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఆధ్వర్యంలో విపక్షాల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి దేశంలోని ప్రముఖ విపక్ష పార్టీల్లో 15 పార్టీలు హాజరయ్యాయి. ఈ సమావేశంలో అన్ని పార్టీలు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తామని ప్రకటించాయి. ఇక రెండవ విపక్ష సమావేశం కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరగబోతోంది. దీనికి కొత్తగా మరో 8 పార్టీలు మద్దతు తెలిపాయి. సోమవారం (జూలై 17) నుంచి జరగబోయే ఈ సమావేశాలకు సర్వం సిద్ధమైనట్లే తెలుస్తోంది.

Opposition Meet: కాంగ్రెస్ చేసిన ఆ ప్రకటనతో వెనక్కి తగ్గిన ఆప్.. అందుకు ఓకే అంటూ ప్రకటన

అయితే ఇటు విపక్షాల్ని ఏకం చేసే పనిలో కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతుంటే.. అటు ఎన్డీయే పక్షాలను ఏకం చేసే పనిలో భారతీయ జనతా పార్టీ సమాయత్తం అవుతోంది. ఎన్డీయే పక్షాల సమావేశం దేశ రాజధాని ఢిల్లీలో మంగళవారం (జూలై 18)న జరగనుంది. కాగా, 30 పార్టీలు ఈ సమావేశానికి హాజరుకానున్నట్లు బీజేపీ అధ్యక్షుడు జేప నడ్డా ప్రకటించారు. ఏక కాలంలో ఇటు విపక్షాలు, అటు అధికార పక్ష కూటములు పోటాపోటీగా సమావేశాలు నిర్వహిస్తుండడం గమనార్హం.

బీజేపీ కూటమిలోని పార్టీలు..
ఎన్డీయేలోని 24 పార్టీలు.. భారతీయ జనతా పార్టీ (BJP), అన్నాడీఎంకే, శివసేన (ఏకనాథ్ షిండే వర్గం), నేషనల్ పీపుల్స్ పార్టీ (NPP), నేషనలిస్ట్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ (NDPP), సిక్కిం క్రాంతికారి మోర్చా (SKM), జన్నాయక్ జనతా పార్టీ (JJP), భారతీయ మక్కల్ కల్వి మున్నేట్ర కజ్గం (IMKMK), ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్ (AJSU), రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా (RPI), మిజో నేషనల్ ఫ్రంట్ (MNF), తమిళ మనీలా కాంగ్రెస్ (TMC), IPFT (త్రిపుర), బోడో పీపుల్స్ పార్టీ (BPP), పాటాలి మక్కల్ కచ్చి (PMK), మహాస్త్రవాది గోమంతక్ పార్టీ (MGP), అప్నా దళ్, అస్సాం గణ పరిషత్ (AGP), రాష్ట్రీయ లోక్ జనశక్తి పార్టీ (RLJP), నిషాద్ పార్టీ, యునైటెడ్ పీపుల్స్ పార్టీ లిబరల్ (UPPL), ఆల్ ఇండియా NR కాంగ్రెస్ పుదుచ్చేరి (AIRNC), శిరోమణి అకాలీదళ్ సాయుంక్త్ (ధింధ్‌సౌక్త్), జనసేన.

Bengal Politics: మమతా బెనర్జీ ప్రభుత్వం 5 నెలల్లో కూలిపోతుందట.. కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు

ఇవి కాకుండా కొత్తగా ఆరు పార్టీలు ఈసారి జరిగే ఎన్డీయే సమావేశంలో పాల్గొననున్నాయి. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (అజిత్ పవార్ వర్గం), లోక్ జన్ శక్తి పార్టీ (రామ్ విలాస్), హిందూస్థానీ అవామ్ మోర్చా (HAM), రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ (RLSP), వికాశీల్ ఇన్సాన్ పార్టీ (VIP), సుహెల్‌దేవ్ భారతీయ సమాజ్ పార్టీ-ఓం ప్రకాష్ రాజ్‌భర్ (SBSP) పార్టీలు జూలై 18న జరిగే ఎన్డీయే సమావేశానికి హాజరుకానున్నాయి. మొత్తంగా 30 పార్టీలు ఎన్డీయే సమావేవంలో పాల్గొననున్నాయి.

కాంగ్రెస్ కూటమిలోని పార్టీలు..
ఇక కాంగ్రెస్ వర్గంలోని పార్టీలు.. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగే సమావేశంలో జనతాదళ్ యూనైటెడ్ (JDU), తృణమూల్ కాంగ్రెస్ (TMC), డీఎంకే (DMK), కాంగ్రెస్ (INC), ఆమ్ ఆద్మీ పార్టీ (AAP), జార్ఖండ్ ముక్తి మోర్చా (JMM), శివసేన (యూబీటీ), నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP), రాష్ట్రీయ్ జనతా దళ్ (RJD), సమాజ్‭వాదీ పార్టీ (SP), సీపీఎం (CPIM), పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ (PDP), సీపీఐఎంల్ (CPIML), సీపీఐ (CPI), నేషనల్ కాన్ఫరెన్స్ (JKNC) పార్టీలు పాల్గొన్నాయి. ఇక రెండవసారి జరుగుతున్న సమావేశంలో వీరితో పాటు ఆల్ ఇండియా ముస్లీం లీగ్, వీసీకే, కేఎండీకే, ఆర్ఎస్పీ, ఏఐఎఫ్బీ, కేరళ కాంగ్రెస్ (జోసెఫ్), కేరళ కాంగ్రెస్ (మణి) అనే ఎనిమిది పార్టీలు పాల్గొననున్నాయి. మొత్తంగా 24 పార్టీలు కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరిగే విపక్షాల సమావేశానికి హాజరుకానున్నాయి.