Bengal Politics: మమతా బెనర్జీ ప్రభుత్వం 5 నెలల్లో కూలిపోతుందట.. కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు

మమతా బెనర్జీ ప్రభుత్వం అన్ని పరిమితులను మించిపోయింది. ఇటీవల ముగిసిన పంచాయతీ ఎన్నికలలో టీఎంసీ విస్తృతంగా రిగ్గింగ్‌ను ఆశ్రయించకపోతే, బీజేప వేల స్థానాలను కైవసం చేసుకునేది

Bengal Politics: మమతా బెనర్జీ ప్రభుత్వం 5 నెలల్లో కూలిపోతుందట.. కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు

Shantanu Thakur: పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో 10 ఏళ్ల పాలన పూర్తి చేసుకుని మూడోసారి అఖండ మెజారిటీతో అధికారంలోకి వచ్చారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 294 స్థానాలకు మమతా బెనర్జీ నాయకత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఏకంగా 211 స్థానాలు గెలుచుకుని అధికారం చేపట్టారు. ఇంతటి బలమైన ప్రభుత్వం ఒకే ఒక ఐదు నెలల్లో కూలిపోతుందని కేంద్ర మంత్రి శంతను ఠాకూర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మమతా బెనర్జీ ప్రభుత్వం పూర్తిగా అవినీతిలో, అక్రమంలో మునిగిపోయిందని, ఎన్నికల్లో రిగ్గింగుకి పాల్పడుతోందని ఆరోపించారు.

NDA vs UPA: ఎవరూ తగ్గడం లేదు.. అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ.. పోటాపోటీగా కూటముల సమావేశం

ఆదివారం ఉత్తర 24 పరగణాస్ జిల్లాలోని తన బొంగావ్ లోక్‌సభ నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమంలో ఎంపి శంతను ఠాకూర్ మాట్లాడుతూ.. “మమతా బెనర్జీ ప్రభుత్వం అన్ని పరిమితులను మించిపోయింది. ఇటీవల ముగిసిన పంచాయతీ ఎన్నికలలో టీఎంసీ విస్తృతంగా రిగ్గింగ్‌ను ఆశ్రయించకపోతే, బీజేప వేల స్థానాలను కైవసం చేసుకునేది. కానీ టీఎంసీ ప్రభుత్వ పర్యవేక్షణలో ఇది చివరి ఎన్నికలు. రాష్ట్ర ఎన్నికల సంఘం సహా అన్ని రాష్ట్ర యంత్రాంగాలు తటస్థ, నిష్పక్షపాత పాత్ర పోషించడంలో విఫలమయ్యాయి” అని అన్నారు.

Opposition Meet: కాంగ్రెస్ చేసిన ఆ ప్రకటనతో వెనక్కి తగ్గిన ఆప్.. అందుకు ఓకే అంటూ ప్రకటన

కొంత కాలంగా విపక్ష పార్టీలు అధికారంలో ఉన్న పలు రాష్ట్ర ప్రభుత్వాలు పడిపోయాయి. దీని వెనుక బీజేపీ ‘ఆపరేషన్ కమల్’ ఉందనే విమర్శలు బలంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో మమత ప్రభుత్వాన్ని పడగొట్టడానికి బీజేపీ ఏమైనా ప్రణాళికలు రచిస్తోందా అనే ఊహాగాణాలు ఊపందుకున్నాయి. అయితే కేంద్ర మంత్రి చేసిన ఈ వ్యాఖ్యలపై స్పందించేందుకు టీఎంసీ ఏమాత్రం సముఖత చూపించలేదు.