Extra Marital Affair : మహిళా కానిస్టేబుల్‌తో తహసిల్దార్ వివాహేతర సంబంధం-హత్య

తహసీల్దార్ తో వివాహేతరం సంబంధం పెట్టుకున్న మహిళా కానిస్టేబుల్ హత్యకు గురైన ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకుంది.  బిజ్నోర్ జిల్లా కు చెందిన రుచిసింగ్ అనే మహిళా కానిస్టేబుల్... ప్రతాప

woman cop extra marital affair

Extra Marital Affair :  తహసీల్దార్ తో వివాహేతరం సంబంధం పెట్టుకున్న మహిళా కానిస్టేబుల్ హత్యకు గురైన ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకుంది.  బిజ్నోర్ జిల్లా కు చెందిన రుచిసింగ్ అనే మహిళా కానిస్టేబుల్… ప్రతాప్ ఘఢ్ జిల్లా రాణిగంజ్ తహసిల్దార్ తో వివాహేతర సంబంధంలో ఉంది.

రుచిసింగ్ లక్నోలో పని చేస్తోంది. అంతకు ముందు ఆమె బారాబంది జిల్లాలోని  అసంద్ర పోలీసు స్టేషన్ లో పని చేశారు. అర్జన్ గంజ్ ప్రాంతంలో ఆమె అద్దె ఇంట్లో నివసిస్తోంది. ఫిబ్రవరి 13 నుంచి ఆమె విధులకు హాజరు కావటంలేదు. కాగా…..ఈనెల21న ఆమె మృతదేహం కాలువలో లభించింది.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేయగా ఆమె వివాహేతర సంబంధం బయట పడింది. పోలీసులు  తహసిల్దార్ ను అదుపులోకి తీసుకుని విచారించగా ఆయన నేరం ఒప్పుకున్నారు.  రుచి సింగ్ తో వివాహేతర సంబంధం ఉందని… ఇటీవలి కాలంలో ఆమె తనను వివాహాం చేసుకోమని ఒత్తిడి చేస్తోందని… అందుకే ఆమెను హత్య చేసినట్లు తహసిల్దార్ నేరం ఒప్పుకున్నారు.

Also Read : Hyderabad : గోవులను తరలిస్తున్న వాహనాన్ని అడ్డుకున్న గో రక్షక్ సభ్యులు.. కత్తులతో దాడి చేసిన దుండగులు

రుచిసింగ్ ను హత్య చేసిన అనంతరం ఆమె మృతదేహాన్ని కాలువలో పడేసినట్లు తెలిపారు.  ఈ కేసులో తహసిల్దార్ తో పాటు ఆయన భార్యను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు దర్యాప్తు కొనసాగుతోందని అదనపు డీసీపీ ఖాసిం అబ్ధి తెలిపారు.