RFCL Victim Suicide Attempt : ఆర్‌ఎఫ్‌సీఎల్‌లో ఉద్యోగం కోసం దళారికి రూ.7 లక్షలు..ఉద్యోగం రాకపోవడంతో ఆత్మహత్యాయత్నం
పెద్దపల్లి జిల్లాలో ఆర్‌ఎఫ్‌సీఎల్ బాధితుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. పాలకుర్తికి చెందిన గంగుల శేఖర్.. ఆర్‌ఎఫ్‌సీఎల్‌లో ఉద్యోగం కోసం దళారికి రూ.7 లక్షలు ఇచ్చాడు. ఎప్పటికీ ఉద్యోగం రాకపోవడంతో తీవ్ర మనస్తాపం చెందిన శేఖర్.. ఉద్యోగం కోసం చేసిన అప్పైనా తీర్చాలనుకున్నాడు.
- bheemraj
- Published On : September 6, 2022 / 03:34 PM IST
RFCL Victim Suicide Attempt
RFCL Victim Suicide Attempt : పెద్దపల్లి జిల్లాలో ఆర్‌ఎఫ్‌సీఎల్ బాధితుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. పాలకుర్తికి చెందిన గంగుల శేఖర్.. ఆర్‌ఎఫ్‌సీఎల్‌లో ఉద్యోగం కోసం దళారికి రూ.7 లక్షలు ఇచ్చాడు. ఎప్పటికీ ఉద్యోగం రాకపోవడంతో తీవ్ర మనస్తాపం చెందిన శేఖర్.. ఉద్యోగం కోసం చేసిన అప్పైనా తీర్చాలనుకున్నాడు.
తెచ్చిన డబ్బుకు వడ్డీలు పెరుగుతుండటంతో… తిరిగి డబ్బులివ్వాలని దళారులను బతిమాలాడు. ఇవాళ, రేప అంటూ తిప్పించిన దళారులు డబ్బులు ఇవ్వలేదు. విసిగిపోయిన శేఖర్… పురుగులు మందు తాగి సూసైడ్ అటెంప్ట్ చేశాడు.
Young Man Suicide: ప్రభుత్వ ఉద్యోగం రాలేదని యువకుడు బలవన్మరణం
స్థానికులు వెంటనే స్పందించి అతన్ని కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితుడు శేఖర్ పరిస్తితి విషమంగా ఉంది. వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
