Young Man Suicide: ప్రభుత్వ ఉద్యోగం రాలేదని యువకుడు బలవన్మరణం
వరంగల్ లో విషాదం నెలకొంది. ప్రభుత్వ ఉద్యోగం రాలేదని ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. వరంగల్ కేయూ దగ్గర ఆత్మహత్యాయత్నం చేసిన యువకుడు సునీల్ మృతి చెందాడు.

Suicide
Man Commits Suicide : వరంగల్ లో విషాదం నెలకొంది. ప్రభుత్వ ఉద్యోగం రాలేదని ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. వరంగల్ కేయూ దగ్గర ఆత్మహత్యాయత్నం చేసిన యువకుడు సునీల్ మృతి చెందాడు. హైదరాబాద్ నిమ్స్‌లో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. పోలీసులు మృతదేహాన్ని యువకుడి స్వగ్రామం తరలించారు.
మహబూబాబాద్ జిల్లా తేజావత్ రామ్ సింగ్ తాండకు చెందిన సునీల్….ప్రభుత్వ ఉద్యోగం రాలేదని మనస్థాపంతో బలవన్మరణానికి పాల్పడ్డాడు. కేయూ దగ్గర పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. తన ఆవేదన సెల్ఫీ వీడియోలో చెప్పుకున్నాడు.
అయితే విషయం తెలుసుకున్న స్నేహితులు అతన్ని ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ నిమ్స్‌లో చేర్చారు. అయితే చికిత్స పొందుతూ సునీల్ మృతి చెందాడు.