గవర్నమెంట్ బస్సులో తీసుకెళ్తోన్న 23 వజ్రాల గాజులు కనపడకుండా పోయాయని బాధిత మహిళ మంగళవారం మే 14న చెన్నై పోలీసులను ఆశ్రయించింది. కోయంబెడులోని చెన్నై మొఫ్పుసిల్ బస్ టెర్మినల్(సీఎంబీటీ) ప్రాంతంలోని పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన తారా చంద్(55) అనే మహిళ గవర్నమెంట్ బస్సులో ప్రయాణిస్తున్న సమయంలో 23 వజ్రాల గాజులు తన నుంచి మిస్సయ్యాయని కంప్లైంట్ చేసింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తారా చంద్ అనే మహిళకు చెన్నై నుంచి 23వజ్రాలు పొదిగిన గాజులు కావాలని ఆర్డర్ వచ్చింది. దీంతో మే9న ట్రిచ్చి నుంచి చెన్నైకు గాజులు తీసుకుని బస్సు ఎక్కింది. సీఎంబీటీ చేరుకున్న తర్వాత చూసుకునే సరికి గాజులు మిస్సయ్యాయి. మొత్తంగా వాటి ధర రూ.23లక్షల వరకూ ఉండొచ్చని ఫిర్యాదులో పేర్కొంది.
సెమీ స్లీపర్ బస్సులో ప్రయాణిస్తూ గాజులను పైన ఉన్న లగేజి ట్రక్కులో పెట్టింది. తర్వాత చూసుకునే సరికి అవి కనిపించకుండాపోయాయి. అంటే అవి ట్రిచ్చిలో.. చెన్నైలో ఎక్కడపోయాయో స్పష్టం కాలేదు. ఎందుకంటే మధ్య దారిలోనూ కొంతమంది పాసింజర్లు ఎక్కి దిగుతూ ఉన్నారు’అని పోలీసు అధికారి తెలిపారు. ఆ రోజు బస్సులో ప్రయాణించిన వారి లిస్టు సేకరించే పనిలో ఉన్నారు.