కరోనా వైరస్ వ్యాపిస్తున్ని వేళ..దేశమంతా లాక్ డౌన్ కొనసాగుతున్న క్రమంలో కూడా కొన్ని దారుణ ఘటనలు జరుగుతున్నాయి. కన్నుమిన్ను లేకుండా ప్రవర్తిస్తున్నారు. సభ్యసమాజం తలదించుకొనేలా కామాంధులు రెచ్చిపోతున్నారు. లాక్ డౌన్ కారణంగా సొంతూరుకు బయలుదేరిన ఓ మహిళకు సహాయం చేయాల్సింది పోయి…దారుణంగా ప్రవర్తించారు. సాముహికంగా అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ విషాద ఘటన రాజస్థాన్ లో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే…
జైపూర్ కు చెందిన ఓ మహిళ… లాక్ డౌన్ కారణంగా మాధోపూర్ లో ఉండిపోవాల్సి వచ్చింది. కానీ లాక్ డౌన్ ఎత్తివేయకపోవడంతో సొంతూరుకు వెళ్లలేపోయింది. చివరకు కాలినడకన వెళ్లాలని అనుకుని..ధైర్యం చేసి అడుగులు వేసింది. ఈ క్రమంలో 2020, ఏప్రిల్ 23వ తేదీ గురువారం రాత్రి మాధోపూర్ కు చేరుకుంది. కానీ..స్థానికులు అడ్డుకుని స్థానికంగా ఏర్పాటు చేసిన క్వారంటైన్ కు తరలించారు.
ఇదే అదనుగా భావించారు ముగ్గురు కామాంధులు. అర్ధరాత్రి క్వారంటైన్ ఏర్పాటు చేసిన పాఠశాలకు చేరుకుని ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. మహిళ కంప్లయింట్ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు. దారుణానికి పాల్పడిన దుర్మార్గులను పోలీసులు అరెస్టు చేసినట్లు సమాచారం.