Extra Marital Affair : వివాహేతర సంబంధం…రాత్రి 11-30కి ప్రియుడికి అన్నం తీసుకెళ్లిన మహిళ….!
వివాహేతర సంబంధం నేపధ్యంలో ఒక మహిళ దారుణ హత్యకు గురయ్యింది. హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించాలని చూస్తున్నారని మృతురాలి కుమార్తె ఆరోపించటంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్
- chvmurthy
- Published On : November 30, 2021 / 09:55 PM IST
New Project
Extra Marital Affair : వివాహేతర సంబంధం నేపధ్యంలో ఒక మహిళ హత్యకు గురయ్యింది. హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించాలని చూస్తున్నారని మృతురాలి కుమార్తె ఆరోపించటంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం మందడం గ్రామానికి చెందిన నాగమణి(35) కి రెండు సంవత్సరాల నుంచి డేవిడ్ రాజు అనే వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగుతోంది. ఈ నేపధ్యంలో ఆదివారం రాత్రి గం.11-30 సమయంలో డేవిడ్‌రాజుకు అన్నం ఇచ్చి వస్తానని ఆమె ఇంటినుంచి వెళ్లింది.
Also Read : Farmer Suicide : కామారెడ్డి జిల్లాలో రైతు ఆత్మహత్య
రాత్రి ఎంత సేపు అయినా ఇంటికి తిరిగి రాకపోవటంతో ఆమె కుమార్తె మైనా, డేవిడ్ రాజు ఇంటి వద్దకు వెళ్ళగా అక్కడ నాగమణి ఆత్మహత్య చేసుకుని కనిపించింది.
మెడకు టవల్ చుట్టి ఫ్యాన్ కు వేలాడుతూ మోకాళ్లపై చనిపోయిన స్ధితిలో తల్లిని చూసిన మైనా ఈ విషయాన్ని గ్రామస్ధులకు తెలిపింది. డేవిడ్ రాజు తన తల్లిని హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు చూస్తున్నాడని మైనా పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
