Young Man Suicide : వివాహిత మాట్లాడటం లేదని యువకుడి ఆత్మహత్య
వివాహిత మహిళతో పరిచయం ఓ యువకుడి ప్రాణాలు తీసింది. పరిచయస్తురాలైన మహిళ గురించి ఊహల్లో విహరిస్తూ.... మహిళ మాట్లాడకపోయే సరికి మనస్తాపం చెందిన యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన సికింద్ర
- chvmurthy
- Published On : November 26, 2021 / 02:50 PM IST
Young Man Suicide
Young Man Suicide : వివాహిత మహిళతో పరిచయం ఓ యువకుడి ప్రాణాలు తీసింది. పరిచయస్తురాలైన మహిళ గురించి ఊహల్లో విహరిస్తూ…. మహిళ మాట్లాడకపోయే సరికి మనస్తాపం చెందిన యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన సికింద్రాబాద్ బోయినపల్లిలో చోటు చేసుకుంది.
బల్కం పేటకు చెందిన ఎలక్ట్రీషియన్ దుర్గేష్ (31) రెండేళ్ల క్రితం ఓల్డ్ బోయిన్‌పల్లిలోని మైత్రివనం రాంరెడ్డి కాలనీలోని ఓ ఇంట్లో కరెంట్ పనులు చేయటం కోసం వెళ్లాడు. ఆ ఇంటి పక్కనే ఉండే ఒక వివాహితతో అతనికి అప్పుడు పరిచయం ఏర్పడింది. ఆమె ఇంట్లో కూడా కొన్ని కరెంట్ పనులు చేశాడు దుర్గేష్.
Also Read : Cyber Cheating : ఫ్లైట్ టికెట్ బుక్ చేస్తే రూ.9.5 లక్షలు మాయం చేసిన సైబర్ నేరగాళ్లు
గత రెండేళ్లుగా ఇద్దరూ ఫోన్ లో మాట్లాడుకోవటం ఛాటింగ్ చేసుకోవటం చేస్తున్నారు. ఆ పరిచయంతో దుర్గేష్ ఆమె ఇంటికి తరచూ రాకపోకలు సాగిస్తూ ఉండేవాడు. ఇటీవలి కాలంలో ఆ వివాహిత మహిళ దుర్గేష్ తో మాట్లాడటం మానేసింది.
దీంతో మనస్తాపం చెందిన దుర్గేష్ గురువారం మహిళ ఇంటికి వచ్చాడు. అక్కడ ఆమె బెడ్ రూంలోకి వెళ్ళి ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
