Youtuber Gulzar Sheikh Arrested (Photo Credit : Google)
YouTuber Gulzar Sheikh Arrested : సోషల్ మీడియాలో పాపులర్ అయ్యేందుకు, తమ వీడియోలకు వ్యూస్ కోసం కొందరు యూట్యూబర్లు వికృత చేష్టలకు పాల్పడుతున్నారు. ప్రమాదకరమైన ప్రాంతాల్లో ప్రాణాంతక స్టంట్స్ చేస్తున్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్ కు చెందిన ఓ యూట్యూబర్ రెచ్చిపోయాడు. రైల్వే ట్రాక్ పై దుశ్చర్యకు పాల్పడ్డాడు. అత్యంత ప్రమాదకరమైన వీడియోలు తీస్తున్నాడు. రైల్వే ట్రాక్ పై రాళ్లు, గ్యాస్ సిలిండర్, సైకిల్, బతికున్న కోడి వంటివి ఉంచుతాడు. రైలు వాటి పైనుంచి వెళితే ఏం జరుగుతుందో అనేది తన వీడియోల ద్వారా చూపిస్తాడు.
ఇలాంటి వీడియోల ద్వార అతడు డబ్బు సంపాదిస్తున్నాడు. కాగా, యూట్యూబర్ తీరు వివాదాస్పదమైంది. అతడు ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నాడని జనాలు మండిపడుతున్నారు. ఇలాంటి పనులతో రైళ్లు ప్రమాదానికి గురయ్యే ప్రమాదం ఉందనే భయాందోళన వ్యక్తమవుతోంది. ఆ యూట్యూబర్ పై నెటిజన్లు రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు.
రైల్వే పోలీసులు వెంటనే స్పందించారు. ఆ యూట్యూబర్ వికృత చేష్టలను సీరియస్ గా తీసుకున్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతూ, రైల్వే ట్రాక్ లను ధ్వంసం చేసేలా.. ట్రాక్ లపై రాళ్లు, గ్యాస్ సిలిండర్ పెట్టి వీడియోలు చేస్తున్న యూట్యూబర్ గుల్జార్ షేక్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. సోషల్ మీడియాలో వైరల్ అయ్యేందుకు, తన వీడియోలకు వ్యూస్ వచ్చేందుకు గుల్జార్ ఇలాంటి వీడియోలు తీస్తున్నాడని పోలీసులు తెలిపారు. ఇలాంటి ప్రమాదకర స్టంట్స్ ఎవరూ చేయొద్దని పోలీసులు సూచించారు. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడేలా వ్యవహరిస్తే తాట తీస్తామని వార్నింగ్ ఇచ్చారు.
Also Read : వృద్ధులే టార్గెట్, అందమైన అమ్మాయిలతో వాట్సాప్ వీడియో కాల్స్.. రూట్ మార్చిన సైబర్ నేరగాళ్లు